Generic Medicines : రోగులకు జనరిక్ మందులనే సూచించాలి లేదంటే చర్యలు తప్పవు : డాక్టర్లకు కేంద్రం వార్నింగ్

 గవర్నమెంట్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇకనుంచి రోగులకు జనరిక్ మందులే రాయలని (సూచించాలని) ఆదేశించింది. అలాకాకుండా బ్రాండెడ్ మెడిసిన్స్ సూచిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.

Generic Medicines

Generic Medicines : గవర్నమెంట్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇకనుంచి రోగులకు జనరిక్ మందులే రాయలని (సూచించాలని) ఆదేశించింది. అలాకాకుండా బ్రాండెడ్ మెడిసిన్స్ సూచిస్తే చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని డాక్టర్లకు కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది. వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే సూచించాలని స్పష్టం చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు ఆస్పత్రులకు వచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలపై కూడా పరిమితి ఉండాలని డాక్టర్లకు సూచించింది. అంతే మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలు నియంత్రించాలని సూచించింది.జనరిక్ మెడిసిన్ సూచించే మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది.

డాక్టర్లు అందరు ఈ నిబంధనలు పాటించి తీరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్. డాక్టర్లు తమ వద్దకు వచ్చే రోగులకు బ్రాండెడ్ ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్న క్రమంలో ఈ ఆదేశాలు జారీ చేసామని వివరించారు.

 

ట్రెండింగ్ వార్తలు