Central Cabinet : నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం…కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై చర్చ

కరోనాతో దేశ పరిస్థితి భయానకంగా మారడంతో ప్రధాని మోడీ వరుస సమీక్షలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇవాళ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Central Cabinet meeting : కరోనాతో దేశ పరిస్థితి భయానకంగా మారడంతో ప్రధాని మోడీ వరుస సమీక్షలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులపై ఆయన ఇవాళ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులను సమీక్షించేందకు మోడీ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. మోడీ అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.

దేశంలో నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు, నియంత్రణకు అనుసరించాల్సిన మార్గాలు, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడోదశ వ్యాక్సినేషన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను మంత్రులతో మోదీ చర్చించే అవకాశం కనిపిస్తోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతపైనా మోడీ ఈ సమావేశంలో మాట్లాడే ఛాన్స్‌ ఉంది. కరోనా కంట్రోల్‌ చేయడానికి మంత్రుల సలహాలను మోడీ తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ, 144 సెక్షన్ల లాంటివి అమలవుతుండగా.. కొన్ని రాష్ట్రాల్లో మినీ లాక్‌డౌన్‌, సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయినా కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో కరోనా కట్టడికి ఇకపై తీసుకోవాల్సిన చర్యలపైనా మోడీ చర్చించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు