నాలుగో విడత లోక్‌స‌భ‌ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి వాటిపై నిషేధం

నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాల్గో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ..

Lok Sabha Election 2024 : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను ఏడు విడుతల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుండగా.. నాల్గో విడతలో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. నాల్గో విడతలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది. ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరగనుంది.

Also Read : CM Jagan : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇలా..

నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాల్గో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం 11గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు కలెక్టరేట్ లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read : Lok Sabha Elections 2024 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బిగ్ ఫైట్.. ఓటర్లు ఎవరికి జైకొడతారో?

 • నేటి నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఒపీనియన్ పోల్స్, ప్రీపోల్స్, ఎన్నికల సర్వేలు వెల్లడించడం పై నిషేధం.
  నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న కార్యాలయానికి 200 మీటర్ల దూరంవరకే అనుమతి.
  అభ్యర్థితో పాటుగా మరో నలుగురు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి.
  పబ్లిక్ హాలీడేలు, ఆదివారం రోజున నామినేషన్ల స్వీకరణ ఉండ‌దు.
  అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేసుకునే వెసులుబాటు.
  పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం –2(ఏ) అసెంబ్లీ నియోజక వర్గం కోసం ఫారం – 2(బి).
  లోక్‌స‌భ అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10వేలు డిపాజిట్‌గా చెల్లించాలి.
  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50శాతం డిపాజిట్ చెల్లించాలి.
  నేటి నుంచి ఏప్రిల్ 25వరకు ప్రతిరోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం.
  నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25.
  ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన.
  ఏప్రిల్ 29న‌ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం.
  మే 13న పోలింగ్, జూన్ 4న‌ ఫలితాలు.
 • ఏపీ ఎన్నికలు ..
  ఏపీ ఎన్నికల్లో ఒంట‌రిగా పోటీ చేస్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .
  మొత్తం 175అసెంబ్లీ, 25ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోన్న వైసీపీ.
  ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు.
  ఏపీలో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ.
  జనసేన 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లలో పోటీ.
  బీజేపీ 10 అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లలో పోటీ.
  ఏపీలో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ.
  ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత్ నేషనల్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ సహా పలు పార్టీలు
 • తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు..
  ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు

 

ట్రెండింగ్ వార్తలు