Central Government : ప్లాస్టిక్ వాడకంపై కేంద్ర కీలక నిర్ణయం.. ఆ కవర్లు నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జులై1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించనుంది. వీటి ఉత్పత్తి, రవాణా కూడా ఉండదని తెలిపింది.

Central Government

Central Government : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్నీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. వీటి తయారీ, విక్రయం, వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.

పాలిథిన్ సంచుల వాడకంపై కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లకే అనుమతి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా ప్రస్తుతం 50 మైక్రాన్లకు పైన ఉండే కవర్లను వినియోగిస్తున్నారు. 2022 డిసెంబర్ వరకు 120 మైక్రాన్ల కవర్లనే వదలని స్పష్టం చేసింది.

కాగా దేశంలో ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. కవర్లు, ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే చాలా దేశాలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తీసేసి నారతో చేసిన సంచులను వాడుతున్నాయి.