Ban On Popular Front of India: పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం

పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ ఐదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కొన్ని రోజులుగా దాడులు జరుపుతోన్న విషయం తెలిసిందే.

Ban On Popular Front of India: పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ ఐదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. యూఏపీఏ కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కొన్ని రోజులుగా దాడులు జరుపుతోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసి, వారు నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించుకుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో పీఎఫ్ఐ సభ్యులు అధికంగా అరెస్టయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సోదాలు కొనసాగాయి. దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై జరిపిన దాడుల్లో ఎన్‌ఐఏ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్, అల్‌ఖైదాల్లో దేశ యువత చేరేలా పీఎఫ్ఐ వారిని తప్పుదారి పట్టిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వ ఐదేళ్ల నిషేధం విధించింది. కాగా, పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు చేస్తుండడంతో పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలకూ దిగారు.

Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

ట్రెండింగ్ వార్తలు