Teacher Eligibility Test : టీచర్లకు టెట్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

TET : ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

TET mandatory Central Government clarified

Teacher Eligibility Test : ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువు ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్‌లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Also Read : Udhayanidhi Stalin : నటి త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

టెట్‌పై 2025లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. తొలుత 2027 ఆగస్టు వరకు గడువు ఇవ్వగా రివ్యూ పిటిషన్ల తర్వాత దాన్ని 2028 ఆగస్టుకు పొడిగించిందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. తమ విజ్ఞప్తితో కొన్ని రాష్ట్రాలు ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆర్టీఈ చట్టం-2009 ప్రకారం.. ఉపాధ్యాయ నియామకాలకు, పదోన్నతులకు టెట్ ఉండటం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 3వ తేదీ వరకు టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. టెట్‌ను ఇన్‌సర్వీస్‌ టీచర్లకు తప్పనిసరి చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.