Live-in Relationship : లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉండే వారిపై కేంద్రం సంచలనం..
Live-in Relationship : లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉండే వారి పట్ల కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
Live-in Relationship
Live-in Relationship : లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉండే వారి పట్ల కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సెన్షస్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా జనగణన – 2027 ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభవుతుంది. అయితే, ఈ జనగణనలో సహజీవన జంటలకు సైతం కుటంబ హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా కేంద్రం వెల్లడించింది.
Also Read : E-3 Sentry : ఇరాన్ కూల్చిన అమెరికా ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ’ ప్రత్యేకతలు ఇవే..
2027 జనాభా గణన ఎప్పుడు నిర్వహిస్తారు?
మన దేశంలో సాధారణంగా పదేళ్లకోసారి జనగణన నిర్వహిస్తారు. ఆఖరిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు. కొవిడ్ కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనగణనకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం జనాభా గణన ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. మొబైల్ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. జనగణన కోసం 33 ప్రశ్నలతో ఓ ప్రశ్నావళిని రూపొందించారు. రెండో దశలో లడఖ్ కేంద్ర పాలిత, జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలు, అలాగే హించల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మినహా భారతదేశం వ్యార్తంగా జనాభా గణన ప్రారంభమవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు.
రెండో దశలో ఎలాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది..
రెండవ దశలో కుటుంబంలో వ్యక్తుల సంఖ్య, వారి పేర్లు, వయస్సు, లింగం, వైవాహిక స్థితి, కులం, మతం, విద్య, భాష, వైకల్యం, వలస, వృత్తి, సంతానోత్పత్తి (వివాహిత మహిళల విషయంలో) వివరాలు సేకరిస్తారు. అదేవిధంగా ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, గృహోపకరణాలు వంటి వివరాలను అడుగుతారు. తృణ ధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, మరుగుదొడ్లు వాడకం, వంటగది సౌకర్యాలు, పంటకు వినియోగించే ఇంధనం వివరాలు సేకరిస్తారు.
