Helmet to Children : కొత్త రూల్..ఇకపై పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి..

ద్విచక్రవాహన నడపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని రూల్ అమలవుతోంది. ఈక్రమంలో మరో కొత్త రూల్..అదే పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

Helmet To Children

New Helmet Rules : వాహనదారుల భద్రత కోసం ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తెస్తోంది. ఒకప్పుడు ద్విచక్ర వ వాహనం నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ లేదు.కానీ హెల్మెట్ తప్పనిసరి అనే రూల్ తెచ్చింది ప్రభుత్వం.ఆ తరువాత నడపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని రూల్ తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త నిబంధన తీసుకురాబోతోంది. అదే..ద్విచక్ర వాహనం నడిపేవారితో పాటు దానిపై ప్రయాణించే చిన్నారులు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది. హెల్మెంట్ అంటే పెద్దగా ఉంటుంది. చిన్నపిల్లలకు అది సెట్ కాదు. అందుకే..ప్రభుత్వం పిల్లలకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను కోరింది.

Also read : Three Point Seat Belt : కొత్త రూల్..కారు బ్యాక్ సీటు మధ్యలో కూర్చునేవారుకూడా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాల్సిందే..

ప్రమాదాల్లో గాయాల నుంచి కాపాడుకునేందుకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. అందుకే హెల్మెట్ తప్పనిసరి అనే రూల్ తీసుకొచ్చింది ప్రభుత్వం.వాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ.. నేడు కేంద్రం కొత్తగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. భారత్‌లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది.

అలాగే పిల్లల భద్రత కోసం.. భద్రతా జీనును(Safety harness) ధరించాలని మరోసారి సూచించింది. కొత్త నిబంధన ప్రకారం వీటిని ఉల్లంగించే వారిపై రూ. 1000 జరిమానాతో పాటు 3నెలలు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడతాయని కేంద్రం సుస్పష్టంగా తెలిపింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 కి సవరణ ద్వారా కొత్త నియమాలు ప్రతిపాదించబడ్డాయి. కొత్తగా అమలులోకి రానున్న ఈ నిబంధనలు నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలకు వర్తించనున్నాయి.

Also read : Elon Musk : చిన్నారుల ఆకలి తీర్చేందుకు.. ప్రపంచ చ‌రిత్రలోనే అతిపెద్ద విరాళం.

వేగం వద్దు..నిదానమే ముద్దు :
పిల్లలతో సహా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం.. గంటకు గరిష్ఠంగా 40 కిమీ కంటే మించిన వేగంతో ప్రయాణించకూడదని సూచించింది. కొత్తగా తెస్తున్న ఈ చట్టాలపై పౌరుల అభిప్రాయాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2021 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పిల్లల హెల్మెట్‌లను తయారు చేయమని ప్రభుత్వం భారతీయ హెల్మెట్ తయారీదారులను కోరింది. వాటి సైజు ప్రకారం, సేఫ్టీ జీను ఒక జత పట్టీలతో రానుంది. అది భుజం లూప్‌లను ఏర్పరుస్తుంది.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం, జీను తక్కువ బరువు, సర్దుబాటు, వాటర్ ఫూఫ్ తో నాణ్యతగా ఉండాలని సూచించింది.

ఈ పట్టీ..అధిక సాంద్రత కలిగిన ఫోమ్‌తో భారీ నైలాన్ లేదా మల్టీఫిలమెంట్ నైలాన్ మెటీరియల్‌ని ఉపయోగించి జీను తయారు చేయబడుతుంది. 30 కిలోల బరువును ఆపగలిగేదిగా ఉండాలి. నాలుగేళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా క్రాష్ హెల్మెట్ లేదా సైకిల్ హెల్మెట్ ధరించటం ఇక తప్పనిసరి. లేదంటే చర్యలు తప్పదంటోంది ప్రభుత్వం.