Corona Cases (5)
Corona Cases : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 202 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860కు చేరుకుంది.
చదవండి : Corona Cases : దేశంలో 7,774 కరోనా కేసులు.. రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ
అలాగే మరణాల సంఖ్య 4,75,636కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,456 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. . ఇక గత 24 గంటల్లో1910917 మందికి టీకా వేయగా… ఇప్పటి వరకు 1,33,17,84,462 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
చదవండి : Corona In Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు, ఒకరు మృతి
ఇక కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 35 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.