One Nation One Election : కేంద్రం కీలక నిర్ణయం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’పై మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ!

ఈనెల 18 నుంచి 22వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఒకే దేశం - ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెడుతుందన్న చర్చ జరుగుతుంది. అయితే, ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేయడం ద్వారా...

Parliament Session

One Nation One Election: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకోసం కొంతకాలంగా కసరత్తు చేస్తున్న కేంద్రం ఆ మేరకు ముందడుగు వేసింది. ఒకే దేశం – ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ కమిటీలో 16 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే, ఈ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతుందన్న వార్తలు వచ్చాయి. కానీ, ప్రత్యేక సమావేశాల తేదీలు ప్రకటించిన మరుసటిరోజే కేంద్రం ‘ ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అంశంపై మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రయోజనాలు, సవాళ్లు ఏంటో తెలుసా?

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ లోక్‌సభ స్థానాలకు, రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం కొన్నేళ్లుగా భావిస్తూ వస్తుంది. తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 16మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనుంది. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్లు’కు అవకాశాలు ఏమేరకు ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అనే విషయాలపై ఈ కమిటీ పూర్తి వివరాలను సేకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిటీ తెలుసుకోనుంది. ఇదిలాఉంటే.. జమిలి ఎన్నికలకు సంబంధించి ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉంటారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కమిటీ సభ్యులతో కూడిన నోటిఫికేషన్‌ను న్యాయశాఖ విడుదల చేయాల్సి ఉంది. కమిటీ సభ్యులు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పూర్తి వివరాలు సేకరించి కేంద్ర న్యాయశాఖకు నివేదిక అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక, న్యాయశాఖ సూచనలతో కేంద్రం ఒకే దేశం – ఒకే ఎన్నికలు విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

One Nation One Election: దేశంలో మరో అతి పెద్ద సంస్కరణ.. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలకు సిద్ధమైన కేంద్రం?

ఈనెల 18 నుంచి 22వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఒకే దేశం – ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెడుతుందన్న చర్చ జరుగుతుంది. అయితే, ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేయడం ద్వారా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు పెట్టే అవకాశాలు తక్కువే. నూతనంగా ఏర్పాటయ్యే కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పూర్తి‌స్థాయి నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సమయం పడుతుంది. దీంతో ఈ సమావేశాల్లో ఒకే దేశం – ఒకే ఎన్నికలు అంశానికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.

మరోవైపు జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే పార్లమెంట్, శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగంలో కనీసం ఐదు బిల్లులు అధికరణలను సవరించాలని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. ఆ సవరణల కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతుంది.