One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రయోజనాలు, సవాళ్లు ఏంటో తెలుసా?

వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చు. పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుంది

One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రయోజనాలు, సవాళ్లు ఏంటో తెలుసా?

One Nation One Election

One Nation One Election – Parliament: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా మరోసారి ఆసక్తి నెలకొంది. దేశంలో ఒకే సారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించాలని చాలా కాలంగా కొందరు వాదిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పలు సందర్భాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక వల్ల ఏయే ప్రయోజనాలు ఉంటాయి? ఏయే సవాళ్లు ఎదురవుతాయో చూద్దాం.

ప్రయోజనాలు
* వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చు
* పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుంది
* అభివృద్ధి పనులకు ఎక్కువ సమయం దొరుకుతుంది
* ఎన్నికల నియమావళి దేశం మొత్తం ఒకేసారి అమల్లో ఉంటుంది
* పాలనాపరమైన పనులకు ఆటంకాలు తగ్గుతాయి
* రాజకీయ నాయకులు పాలసీల రూపకల్పనపై దృష్టి పెట్టడానికి అధిక సమయం దొరుకుతుంది

సవాళ్లు
* దేశంలోని ఓటర్లకు, అధికారులకు, ఎన్నికల నిర్వహణకు తగ్గ లాజిస్టిక్స్ అవసరం
* భద్రతా పరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది
* ఎన్నికల వేళ ప్రజలకు, పోలింగ్ సిబ్బందికి తగినంత భద్రత కల్పించడంలో సవాళ్లు ఎదురుకావచ్చు
* జాతీయ, ప్రాంతీయ సమస్యలు ఒకేసారి తెరపైకి వచ్చి గందరగోళం నెలకొనవచ్చు
* రాజ్యాంగబద్ధ సవరణ చేయడం కూడా పెద్ద సవాళుతో కూడుకున్న విషయమే
* ఓటర్లు లోక్‌సభ, అసెంబ్లీలో ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండొచ్చు

One Nation One Election: దేశంలో మరో అతి పెద్ద సంస్కరణ.. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలకు సిద్ధమైన కేంద్రం?