Onions: ఇప్పటికే టమాటా.. ఇప్పుడు ఉల్లి ధరల భయం.. దీంతో కేంద్ర సర్కారు ఏం చేస్తోందంటే?

ఈ మేరకు ఇవాళ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అంతేగాక..

Tomato Onion

Onions – Tomato: ఇప్పటికే సామాన్యుడు కొనుగోలు చేయలేనంతగా టమాటా ధరలు పెరిగాయి. ఇప్పుడు ఉల్లి ధరల భయం కూడా పట్టుకుంది. దేశంలో పలు ప్రాంతాల్లో ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఉల్లి ధరలు మరింత పెరిగిపోకుండా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ (buffer stock) నుంచి ఉల్లిపాయలను పంపిణీ చేయడం ప్రారంభించింది.

కేంద్ర సర్కారు 2023-24 ఏడాదికి మొత్తం మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లి బఫర్‌ స్టాక్‌ను గోదాముల్లో భద్రపరిచింది. ఇప్పుడు దేశంలోని ప్రధాన మార్కెట్లకు ఉల్లిని పంపుతోంది. మొదట ఏయే ప్రాంతాల్లో రేట్లు పెరుగుతున్నాయో ఆయా ప్రాంతాలకు ఉల్లిని సరఫరా చేస్తున్నారు.

ఈ-వేలం వేయడం, ఈ-కామర్స్‌ వేదికల్లో రిటైల్‌ అమ్మకాల ద్వారా ఉల్లిని పంపుతున్నారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ విషయంలో విజ్ఞప్తి చేసుకుంటే కూడా తగ్గింపు ధరకు పంపుతామని పేర్కొంది.

దేశంలో గతంలో పలు సమయాల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉల్లి బఫర్ స్టాక్ లక్ష మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ నిల్వలను మూడు రెట్లు పెంచింది.

Tomato Price: హమ్మయ్య.. భారీగా తగ్గిన టమాటా ధర