Vaccine Production : సీరం, భారత బయోటెక్‌కు కేంద్రం ఆర్థిక సాయం

దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది.

Vaccine Production : దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్‌కు ఆర్థిక సాయం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టిసారించింది.

సీరమ్ ఇనిస్టిట్యూట్ కు రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకారం తెలిపింది. అలాగే భారత్ బయోటెక్‌కు రూ.1,500 కోట్లు విడుదల చేయనుంది కేంద్రం. రుణాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది.

సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలంటే రూ.3వేల కోట్లు కావాలని ఇదివరకే సీరమ్ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు