×
Ad

ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు రిస్క్.. చంద్రబాబుకు సవాళ్లు?

ఉపాధి కల్పనలో తేడా వస్తే కూలీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.

G RAM G: కేంద్రప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం విధాన పరంగా ఏ డెసిషన్‌ తీసుకున్న ఓపెన్ డయాస్ మీద తప్పుబట్టలేని పరిస్థితి. కరాఖండిగా వ్యతిరేకించలేని సిచ్యువేషన్. అలా అని కొన్ని అంశాల విషయంలో సైలెంట్‌గా ఉంటే కుదిరే పని కాదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అలాంటి సిచ్యువేషనే వచ్చిందట. ఉపాధి హామీ పథకంలో మార్పులు ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు సీఎం చంద్రబాబుకు రిస్క్‌గా మారబోతోందట.

గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు నిధుల వాటాను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు తీవ్ర సమస్యగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం MGNREGA కింద ప్రత్యేక చట్టం ద్వారా వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.

ఉపాధికి గ్యారెంటీ కల్పిస్తూ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ చట్టం తెచ్చారు. గత పదకొండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. అయితే లేటెస్ట్‌గా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధి హామీ చట్టాన్ని సమూలంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.

Also Read: Video: నిద్రలో పదో అంతస్తు నుంచి పడిపోయిన వ్యక్తి.. కాలు 8వ అంతస్తు గ్రిల్‌లో ఇరుక్కుపోవడంతో..

మహాత్మాగాంధీ పేరుతో ఉన్న స్కీమ్‌ను మారుస్తూ వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్‌గా పేరు పెట్టింది కేంద్రం. ఇలా పేరు మార్చడమే కాదు ..కేంద్రం రిలీజ్ చేసే నిధులను భారీగా తగ్గించేసింది. ఇప్పటివరకు ఈ స్కీమ్‌ కింద కేంద్రం 90 శాతం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం వాటా సమకూర్చేవి. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గిపోనుంది.

సేమ్‌టైమ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద 40 శాతం భరించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం చట్ట సవరణపై రాజకీయ దుమారం రేపుతోంది. అయితే కేంద్రం చేసిన మార్పులపై దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతున్నా, ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబుకు మాత్రం తీవ్ర నష్టమన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఫేస్ చేస్తున్న ఆర్థిక సమస్యలకు తోడుగా ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు తగ్గే అవకాశం ఉంది. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది.

కేంద్రం తగ్గించిన వాటాను రాష్ట్రం భర్తీ చేయడం సాధ్యమా?
స్టేట్‌ గవర్నమెంట్‌ షేర్ ఇవ్వకుంటే..రాష్ట్రంలో ఉపాధి కింద జరిగే పనులు ఆగిపోనున్నాయా? ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం తగ్గించిన వాటాను రాష్ట్రం భర్తీ చేయడం సాధ్యమా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఇచ్చే వాటా 30శాతం తగ్గి..రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 30శాతం భారం పడితే..కూలీలకు ఉపాధి తగ్గడంతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపు సవాల్‌గా మారే అవకాశం ఉందని అంటున్నారు. అభివృద్ధిపైనా ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలో కూడా ఉపాధి హామీ నిధులతో రోడ్లు, కాలువలు, గోశాలలు వంటి పనులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రం చేసిన సవరణతో ఈ నిధుల విడుదలలో భారీగా తేడా వచ్చే అవకాశం ఉంది. కేంద్రంపై భారం తగ్గి..రాష్ట్ర ప్రభుత్వంపై బర్డెయిన్ పడితే..ఇక్కడ నిధుల కొరత ఉండటంతో అభివృద్ధి పనులు నెమ్మదిగా కొనసాగే పరిస్థితి రావొచ్చు. ఉపాధి హామీ స్కీమ్‌పై కేంద్రం చేసిన సవరణతో సీఎం చంద్రబాబు రెండు విధాలుగా నష్టపోయే ప్రమాదం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఉపాధి కల్పనలో తేడా వస్తే కూలీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పనులు చేపట్టలేకపోతే సీఎం చంద్రబాబుకు రిస్క్‌ తప్పేలా లేదు. అయితే కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడటం ఖాయం. అలా అని సీఎం చంద్రబాబు బహిరంగం తప్పుబట్టలేని పరిస్థితి. అయితే మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ స్కీమ్‌ను యథావిధిగా అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ లీడర్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రం డెసిషన్‌తో ఎదురయ్యే సవాళ్లను చంద్రబాబు ఎలా ఫేస్ చేస్తారో చూడాలి మరి.