×
Ad

Chandrababu – Amit Shah : అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం.. ఐదేళ్ల తర్వాత బీజేపీ నేతలతో తొలిసారి భేటీ

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏను బలపరిచే పనిలో ఆ పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. పాత మిత్రులను బీజేపీ మరోసారి దగ్గరకు చేర్చుకుంటోంది.

  • Published On : June 3, 2023 / 11:13 PM IST

Chandrababu - Amit Shah

Amit Shah – JP Nadda : బీజేపీ అధిష్టానంతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది. అమిత్ షా నివాసంలో దాదాపు 50 నిముషాల పాటు సమావేశం కొనసాగింది. అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ సహా జాతీయ రాజకీయ అంశాలు, బీజేపీతో పొత్తులు, ఎన్డీఏలో చేరికలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఐదేళ్ల క్రితం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిన తర్వాత తొలిసారిగా బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమిత్ షా ఆహ్వానం మేరకే ఢిల్లీకి చంద్రబాబు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో లేకపోయినా పార్లమెంట్ లో బీజేపీకి టీడీపీ మద్దతిస్తూనేవుంది.

Nara Lokesh : జగన్ అప్పుల అప్పారావు.. చంద్రన్న సంపద సృష్టికర్త : నారా లోకేష్

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయడం లేదని 2018 మార్చి 16న ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకి వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏను బలపరిచే పనిలో ఆ పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. పాత మిత్రులను బీజేపీ మరోసారి దగ్గరకు చేర్చుకుంటోంది.

తెలంగాణలో టీడీపీతో కలిసి వెళ్తే విజయ అవకాశాలు ఉంటాయని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఎన్డీఏలో భాగస్వాములవుతారా? ఏపీ, తెలంగాణలలో పొత్తులకే పరిమితం అవుతారా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.