Nara Lokesh : జగన్ అప్పుల అప్పారావు.. చంద్రన్న సంపద సృష్టికర్త : నారా లోకేష్

జగన్ ది రాక్షస మనస్తత్వం... ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు... కానీ, జగన్ మాత్రం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడని తెలిపారు.

Nara Lokesh : జగన్ అప్పుల అప్పారావు.. చంద్రన్న సంపద సృష్టికర్త : నారా లోకేష్

Nara Lokesh (3)

Maidukuru Public Meeting : మైదుకూరు మాస్ జాతర అదిరిపోయిందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఎంతో మహిమ గల మాధవరాయుడు ఆలయం ఉన్న పుణ్య భూమి మైదుకూరు అని కొనియాడారు. పేరులోనే కాదు తెలివైన ప్రజలు ఉన్న ప్రాంతం మైదుకూరు అని అన్నారు. కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారు నడిచిన గొప్ప నేల మైదుకూరు అని తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న ఆధ్యాత్మిక నేలపై పాదయాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ మేరకు శనివారం మైదుకూరు బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడారు.

యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి భయపడిందన్నారు. కడప గడ్డపై యువగళం ప్రభంజనం చూసి ప్యాలస్ పిల్లికి నిద్ర పట్టడం లేదని తెలిపారు. వైసీపీ పార్టీ గుర్తు మారిందని.. ఫ్యాన్ కాదు కోడి గుడ్డు అని ఎద్దేవా చేశారు. తనపై ప్యాలస్ పిల్లి కోడిగుడ్లు వేయించాడని ఆరోపించారు. “క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది, నీ తొక్కలో కోడి గుడ్డుకు భయపడతామా? కోడి గుడ్డు వేసిన సైకో గాళ్ళకి మన వాళ్లు మొహం మీద ఆమ్లెట్ వేసి పంపారు” అని అన్నారు.

KA Paul : నేను అధికారంలోకి వస్తే.. తెలంగాణలో ప్రతి గ్రామానికి సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తా : కే.ఏ పాల్

సైకోస్.. చీకట్లో కోడిగుడ్లు విసరడం కాదు దమ్ముంటే నేరుగా వచ్చి నిలబడండి.. పసుపు సైన్యం పవర్ ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు. ప్యాలస్ పిల్లికి దమ్ము, ధైర్యం ఉంటే పరదాలు లేకుండా నా లాగా ప్రజల్లో తిరగాలని చెప్పారు. పరదాలు లేకపోతే ప్యాలస్ పిల్లికి పులుసు కారిపోవడం ఖాయమని విమర్శించారు. ఒక్క రోజు పరదాలు లేకుండా వెళితే ప్యాలస్ పిల్లిపై ఏం పడతాయో గెస్ చెయ్యండి అని అన్నారు. కోడిగుడ్లు, టొమాటోలు, చెత్త, చెదారం అన్నీ ప్యాలస్ పిల్లిపై పడతాయని.. అందుకే పరదాల మధ్య పర్యటించి పారిపోతాడని విమర్శించారు.

ధైర్యంగా ఒక్క రోజు జనాల్లో తిరగలేని బ్రతుకు ప్యాలస్ పిల్లిది అని అన్నారు. “నేను మరో సారి చెబుతున్నా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర… ప్రొద్దుటూరులో చూసింది ట్రైలర్ మాత్రమే, నేను చిటికేస్తే గుడ్డు విసిరిన వాడు కనిపించే వాడు కాదు. నాకు మా నాన్న అంత ఓపిక అసలు లేదు.. అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దబిడి దిబిడే” అని అన్నారు. ఒక్క ఛాన్స్..ఒక్క ఛాన్స్ అన్నావ్, ఇస్తే చేసిందేంటీ? రాష్ట్రాన్ని నాశనం చేసి ప్యాలస్ లో పడుకున్నాడు అని ఫైర్ అయ్యారు. రూ.12 లక్షల కోట్ల అప్పు చేశాడని.. పుట్టే ప్రతి బిడ్డ మీద అప్పు ఎంతో తెలుసా రూ.2 లక్షలు అని పేర్కొన్నారు.

Odisha Train Accident: రైలు ప్రమాదం నుంచి బయటపడి సొంత ప్రాంతానికి తెలుగు యువకులు.. ఏం చెప్పారంటే..?

జగన్ అప్పుల అప్పారావు.. చంద్రన్న సంపద సృష్టికర్త అని అన్నారు. జగన్ ది కక్ష సాధింపు…చంద్రన్నది రాజనీతి అని పేర్కొన్నారు. వైసీపీ అంటే కోడికత్తి, కోడి గుడ్డు…టీడీపీ అంటే తెలుగు వారి ఆత్మగౌరవం అని వెల్లడించారు. వైసీపీది దున్నపోతు ప్రభుత్వం…టీడీపీది సంక్షేమ ప్రభుత్వం అని తెలిపారు. జగన్ పాము కంటే ప్రమాదమని, పాము తన పిల్లల్ని తానే తింటుందన్నారు. జగన్ కూడా పాము లాగే సొంత కుటుంబ సభ్యుల్ని, పార్టీ నాయకుల్ని కూడా మింగేస్తున్నాడని ఆరోపించారు.

సొంత బాబాయ్ వివేకాను అత్యంత కిరాతకంగా జగన్, అవినాష్ కలిసి చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా సొంత చెల్లే రహస్య సాక్షిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ కేసు నుండి బయటపడటానికి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని బలి ఇచ్చాడని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకి బాబాయ్ మర్డర్ కేసు వీక్ అయ్యిందన్నారు. గత ఎన్నికల్లో సాయం చేసిన కేసీఆర్ కు జగన్ టోపీ పెట్టాడని పేర్కొన్నారు.

Hijab Controversy : మధ్యప్రదేశ్ స్కూల్ లో హిజాబ్ తప్పనిసరి.. పాఠశాల గుర్తింపు రద్దు చేసిన ప్రభుత్వం

అవినాష్ రెడ్డి, భారతి రెడ్డిని కాపాడటానికి కవితను బలి ఇస్తున్నాడు అనేది ఢిల్లీ టాక్ అని అన్నారు. ఆఖరికి బాబాయ్ మర్డర్ ని కూడా జగన్ క్విడ్ ప్రోకోకి వాడుకున్నాడని విమర్శించారు. “నిన్న హడావిడిగా మన వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి సార్ స్పెషల్ స్టేటస్ వచ్చింది అన్నారు? జగన్ ఢిల్లీ వెళ్ళింది బాబాయ్ మర్డర్ కేసులో అరెస్ట్ చెయ్యొద్దు అని కాళ్లు పట్టుకోవడానికి కదా.. మరి ప్రత్యేకహోదా ఎప్పుడు వచ్చింది అని అడిగానని చెప్పారు.

ఆ ప్రత్యేకహోదా కాదు సార్ వివేకా మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్. భాస్కర్ రెడ్డికి ప్రత్యేకహోదా వచ్చిందని తెలిపారని చెప్పారు. చంచల్ గూడా జైల్లో భాస్కర్ రెడ్డి స్పెషల్ స్టేటస్ ఖైదీ అంట.. జగన్ కి అసలు రాయలసీమ పౌరుషమే లేదు స్పెషల్ స్టేటస్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. జగన్ ఎన్ని స్కెచ్ లు వేసినా నిజం ఆగదన్నారు. హూ కిల్డ్ బాబాయ్…హూ కిల్డ్ బాబాయ్? అని కడప గడ్డపై నిలబడి అడుగుతున్నానని పేర్కొన్నారు. జగన్ అండ్ అవినాష్ కిల్డ్ బాబాయ్.. నీ సొంత జిల్లా ప్రజలు చెబుతున్నారు అది జగనాసుర రక్త చరిత్ర అని అన్నారు.

Odisha Train Accident: ప్రమాద బాధితులను పరామర్శించిన మోదీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

జగన్ పదే పదే కడప బిడ్డని అంటాడు… పులివెందుల బస్ స్టాండ్ కట్టడానికి నాలుగేళ్లు పట్టిందన్నారు. జిల్లాకి జగన్ చేసింది ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ముందా? సత్తా ఉందా? అని అడిగారు. కడపకి ఏం చేశామో చెప్పే దమ్ము తనకు ఉందని.. ఏ సెంటర్ కి వస్తావో రా, కడపకు జగన్ ఎం చేశాడో? తాము ఏం చేశామో? చర్చించుకుందారా అని సవాల్ చేశారు. జగన్ కడప బిడ్డవి కాదని.. కడపకి పట్టిన శని అని విమర్శించారు. కడప జిల్లాకి జగన్ ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా? అని అడిగారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడితే సినిమా అన్నాడు.. కొబ్బరి కాయలు కొట్టి నాలుగేళ్లు అవుతుందని.. జగన్ చేసిందేంటని నిలదీశారు. కడప జిల్లాకి జగన్ ఘరానా మోసం చేశారని విమర్శించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం అయ్యింది? అన్నమయ్య బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావ్? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కడప జిల్లాల్లో ప్రాజెక్టులు కడితే… జగన్ హయాంలో ప్రాజెక్టులు పడగొట్టాడని తెలిపారు. సొంత జిల్లాకి ఉపయోగపడని చెత్త సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. తాను వచ్చి నిలదీసిన తరువాత దున్నపోతు ప్రభుత్వం నిద్రలేచిందన్నారు.

Malla Reddy : మంత్రి మల్లారెడ్డిని ఇలా కూడా వాడేస్తున్నారా.. ఆహా సినిమా ప్రమోషన్స్ కోసం నటించిన మల్లారెడ్డి..

నాలుగేళ్లు పసుపు రైతుల వద్ద పసుపు కొనలేదు.. ఇప్పుడు తాను జిల్లాలో తిరుగుతున్నాను అని హడావిడిగా పసుపు కొంటాం అంటూ అధికారులు బయలుదేరారు.. అది యువగళం దెబ్బ అని అన్నారు. జగన్ కి ఒక జబ్బు ఉంది.. మైథోమానియా సిండ్రోమ్ తో జగన్ బాధపడుతున్నాడని తెలిపారు. ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం అని అన్నారు. మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్దం చెబుతున్నాడు అని అన్నారు.

బెంగళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు… ఇన్నీ ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని జగన్ చెబుతాడని ఎద్దేవా చేశారు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టీవీ, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్దాలు చెబుతూ అబద్దంలోనే బ్రతికేస్తాడని తెలిపారు. ఒకప్పుడు కేరళని పాలించిన కొంతమంది రాజులు రొమ్ము పన్ను వేశారు.. జగన్ అంతకంటే దుర్మార్గమైన పాలకుడు అని విమర్శించారు. రొమ్ము పన్ను పేరు ముళకరం.. జగన్ పన్ను పేరు జే ట్యాక్స్ అని పేర్కొన్నారు. రొమ్ముపై పన్ను వేసింది మార్తాండ వర్మ అయితే చెత్తపై కూడా పన్నేసిన సైకో జగన్ అని అన్నారు.

Odisha train accident: సిగ్నలింగ్ ఫెయిల్యూర్ వల్లే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమిక విచారణలో వెల్లడి

పేదల ఏడుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయని, అందుకే విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది. త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. ప్రతి దానిపై తన బొమ్మ వేసుకునే జగన్ కరెంట్ బిల్లు మీద, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా బొమ్మ ఎందుకు వేసుకోవడం లేదు? అని అన్నారు.

జగన్ ది రాక్షస మనస్తత్వం… ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు… కానీ, జగన్ మాత్రం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడని తెలిపారు. అన్న క్యాంటిన్ రద్దు, పండుగ కానుక రద్దు, పెళ్లి కానుక రద్దు, చంద్రన్న బీమా రద్దు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు, 6 లక్షల పెన్షన్లు రద్దు, డ్రిప్ ఇరిగేషన్ రద్దు వంటి 100 సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ రద్దు చేశారని తెలిపారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రన్న మహానాడులో మ్యానిఫెస్టో ప్రకటించగానే తాడేపల్లి ప్యాలస్ లో భూకంపం వచ్చింది… ప్యాలస్ పిల్లి జడుసుకుందని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాకే మినీ మ్యానిఫెస్టో ప్రకటించామని తెలిపారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం ఒక మిస్టరీ.. NFIR ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు

మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే.. చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తామని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తామని, అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దొరకని దిక్కుమాలిన పరిస్థితి జగన్ పాలనలో ఉందని, నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతుల బాధలు చూశామని… టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగస్తులు, పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని, ఒకటో తారీఖున జీతం, మీ బకాయిలు తీర్చేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు.