Chandrayaan 3 : చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్-3.. జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశం.. 17న కీలక ఘట్టం..

ఆగస్టు 17న చంద్రయాన్ -3 ప్రయోగంలో ఇస్రో కీలక ఘట్టాన్ని చేపట్టనుంది. గురువారం వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది.

Chandrayaan-3 Mission

Chandrayaan 3 Mission : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రవేశపెట్టిన చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ఒక్కో కక్ష్యను దాటుకుంటూ ఇస్రో అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తోంది. తాజాగా చంద్రయాన్ -3 మిషన్ చంద్రుడికి మరింత చేరువగా వెళ్లింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం ఉదయం ట్విటర్ వేదికగా తెలిపింది. ఉదయం 8.30 గంటలకు చంద్రయాన్ -3 నాలుగోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు చంద్రయాన్-3కి ఇదే చివరి కక్ష్య. ప్రస్తుతం ఇస్రో ప్రకారం.. చంద్రయాన్ కక్ష్యను 153కిలో మీటర్లు x 163 కిలో మీటర్లులకు తగ్గించినట్లు తెలిపింది. ఫలితంగా చంద్రయాన్-3 చంద్రుడికి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది.

Chandrayaan-3 vs Luna-25 : జాబిల్లిపైకి రష్యా ప్రయోగం వల్ల చంద్రయాన్‌-3కి ఇబ్బందులుంటాయా? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?

ఆగస్టు 17న చంద్రయాన్ -3 ప్రయోగంలో ఇస్రో కీలక ఘట్టాన్ని చేపట్టనుంది. గురువారం వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి సొంతంగా చంద్రుడిని చుట్టేస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఇస్రో శాస్త్రవేత్తలు భావించినట్లుగా జరిగితే ఈనెల 23న సాయంత్రం 5.47గంటలకు ల్యాండర్ చంద్రుడిపైకి అడుగుపెట్టనుంది. అయితే, చంద్రుడి ఉపరితలం సమీపిస్తున్నప్పుడు ల్యాండర్ వేగాన్ని సమాంతరం నుంచి వర్టికల్ దిశగా మార్చడమనేది చాలెంజింగ్ విషయం. 30 కిలో మీటర్ల కక్ష్య నుంచి ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తూ విజయవతంగా చంద్రుడి ఉపరితలంపై తుది ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది.

Chandrayaan-3: అంతరిక్షం నుంచి భూమి ఇలా ఉంటుంది.. ఫొటోలు విడుదల చేసిన చంద్రయాన్-3

చంద్రయాన్-3 ప్రయోగాన్ని జులై14న ఇస్రో శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3లో భాగమైన విక్రమ్ (ల్యాండర్), ప్రగ్యాన్ (రోవర్) చంద్రుడిపై ల్యాండ్ కానున్నాయి. ఇందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తేదీని 23గా వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ఈనెల 23న సాయంత్రం సక్సెస్‌ఫుల్‌గా అడుగుపెడుతుంది.

ట్రెండింగ్ వార్తలు