Chandrayaan-3
Chandrayaan 3 – ISRO: చంద్రయాన్-3 జాబిలిపై అడుగుపెడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు చాలా మంది మదిలో ఉన్నాయి. వాటిలో టాప్-5 ప్రశ్నలు, వాటి సమాధానాలు సంక్షిప్తంగా..
చంద్రయాన్-3 అంటే ఏమిటి?
ఇస్రో చంద్రయాన్-2కి కొనసాగింపు మిషనే చంద్రయాన్-3. చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్ కాకపోవడంతో లోపాలను సరిచేసి, మరింత సాంకేతికతను జోడించి ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇందులో రోవర్, ల్యాండర్ చంద్రుడిపై దిగుతాయి.
చంద్రయాన్-2కి, చంద్రయాన్-3కి తేడాలేంటి?
చంద్రయాన్-3కి ఆర్బిటార్ లేదు. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఆ ఆర్బిటర్ జీవిత కాలం ఏడాది. అది ఇప్పుడు చంద్రయాన్-3కి సాయం చేస్తుంది. చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. అత్యధునిక సాంకేతికతో ప్రవేశపెడుతున్నారు. ప్రొపల్సన్ మాడ్యూల్ జీవిత కాలం 3 నుంచి 6 నెలలు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే.
చంద్రయాన్-3 లక్ష్యాలు?
సాఫ్ట్ ల్యాండింగ్, చంద్రుడిపై తిరిగే సామర్థ్యం ప్రదర్శించడం, జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ శాస్త్రీయ పరిశోధనలు చేయడం
ల్యాండర్, రోవర్ లోని పేలోడ్స్ అంటే?
విక్రమ్ ల్యాండర్(3 పేలోడ్స్), రోవర్ (2 పేలోడ్స్) నుంచి రానున్న సమాచారాన్ని ఇస్రో విశ్లేషిస్తుంది. ఒక్కో పేలోడ్ ఒక్కో సమాచారానికి ఉద్దేశించినవి. చంద్రుడిపై ఉష్ణ లక్షణాలను సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ChaSTE) పసిగడుతుంది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA)కి సంబంధించిన పరికరం భూకంపాల డేటా సేకరణకు సంబంధించింది.
ప్లాస్మా సాంద్రతను లాంగ్‌ముయిర్ ప్రోబ్ (LP) గుర్తిస్తుంది. నాసా నుంచి తెప్పించిన పాస్సివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే చంద్రుడిపై గమనాన్ని పరిశోధిస్తుంది. ఇక రోవర్ లోని ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) అక్కడి రసాయనాలను గుర్తిస్తుంది. చంద్రుడిపై మూలకాల మిశ్రమాలను లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరిశోధిస్తుంది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన డేటాను ల్యాండర్ కు పంపడానికే రోవర్ లో పేలోడ్‌లతో కలిపి పరికరాలు ఉంటాయి.
ఎన్ని రోజులు ఈ పరిశోధనలు?
చంద్రుడిపై రోవర్, ల్యాండర్లు ఒక లూనార్ డే (14 Earth days) పరిశోధనలు చేస్తాయి.
Chandrayaan 3: అగ్రదేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నాయో తెలుసా?