‘చెప్పుతో కొట్టండి’ పేరిట నిరసన.. ఎంత పెద్ద చెప్పులు పట్టుకున్నారో చూడండి..

నాసిరకం పనులు చేసిన, అవినీతికి పాల్పడిన వారికి గుణపాఠం చెప్పాలని..

మహారాష్ట్రలో సింధుదుర్గ్‌లోని మాల్వాన్‌లో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఛతపత్రి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ఆ రాష్ట్రంలోని ఇండియా కూటమిలోని పార్టీలు ఇవాళ ‘చెప్పుతో కొట్టండి’ పేరుతో నిరసన తెలిపాయి.

మహా వికాస్ అఘాడి అగ్రనేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, నానా పటోలే ఇందులో పాల్గొన్నారు. ఫోర్ట్ లోని హుతాత్మా చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఏకనాథ్ షిండే ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.

అవినీతిపరులైన శివద్రోహులను క్షమించేది లేదని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పేర్కొంది. నాసిరకం పనులు చేసిన, అవినీతికి పాల్పడిన వారికి గుణపాఠం చెప్పాలని తెలిపింది. విగ్రహం కూలిపోయేలా నిర్మించి శివాజీని అవమానించిన వారికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. కాగా, ఆ విగ్రహాన్ని 8 నెలల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అది కూలిన ఘటనపై మహారాష్ట్రలో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది.

Also Read: విద్యార్థులకు అలర్ట్.. రేపు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు

ట్రెండింగ్ వార్తలు