Schools Holiday : విద్యార్థులకు అలర్ట్.. రేపు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

Heavy Rain in Telangana
Monday Schools Holiday Due to Heavy Rain : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరదనీటిలో చిక్కుకొని పలువురు మృత్యువాత పడ్డారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఎదురైనా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సూచించారు.
Also Read : రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు సెలవు సోమవారం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. అందరూ విధుల్లో పాల్గొనాలని మంత్రి ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం హెలికాప్టర్ల కోసం నేవీకి విజ్ఞప్తి చేశామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి పొంగులేటి కోరారు.