World Highest Chenab bridge : మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు

మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు అబ్బురపరుస్తున్నాయి.

World  Highest chenab bridge : మేఘాలను తాకే ఎత్తైన భవనాలను చూశాం.మేఘాల్లోంచి దూసుకుపోయే విమానాన్ని చూశాం. కానీ మేఘాలకు పైన నిర్మించిన బ్రిడ్జినిచూశారా? అది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే ఉంది. మేఘాలపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌. దాని పేరు చీబ‌న్ బ్రిడ్జ్‌.

ఈ బ్రిడ్జ్ ని జ‌మ్మూక‌శ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీబ‌న్ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. ఆ రైల్వే బ్రిడ్జ్‌ సరికొత్త ఫోటోల‌ను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్..కూ యాప్‌లో ఆ పోస్టు చేశారు. మేఘాల‌పై చినాబ్ బ్రిడ్జ్ ఆర్చీ ఉన్న‌ట్లు ఆ ఫోటోకు ఆయ‌న క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు.

హిమాల‌య ప‌ర్వ‌తాల‌పై నిర్మిస్తున్న ఆ బ్రిడ్జ్ సుమారు 1315 మీట‌ర్ల పొడుగు ఉంది. పారిస్ లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈఫిల్ ట‌వ‌ర్ క‌న్నా ఇది 35 మీట‌ర్ల ఎత్తు ఎక్కువ‌ కావటం విశేషం.

క‌శ్మీర్ వ్యాలీలో క‌నెక్టివిటీని పెంచేందుకు ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. స‌ముద్ర మ‌ట్టానికి 359 మీట‌ర్ల ఎత్తులో బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ విభిన్న కోణాల్లో తీసిన బ్రిడ్జ్ ఆర్క్ ఫోటోలు నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి.

మేఘాల క‌న్నా ఎత్తులో.. ప‌ర్వ‌తాల మ‌ధ్య ఆ బ్రిడ్జ్ ఆక‌ర్ష‌ణీయంగా..అత్యంత సుందరంగా..అబ్బురంగా క‌నిపించి కనువిందు చేస్తోంది. మరి మీరు కూడా చూసేయండి ఈ చీబన్ బ్రిడ్జ్ ఫోటోలను..

ట్రెండింగ్ వార్తలు