కొడుకు అంత్యక్రియల్లో పాటతో తల్లి నివాళి

కొడుకు అంత్యక్రియల్లో పాటతో తల్లి నివాళి

Updated On : July 14, 2025 / 12:45 PM IST

క‌న్న‌త‌ల్లి త‌న కొడుకుకు కడసారి పలిని వీడ్కోలు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తనకు తలకొరివి పెట్టాల్ని కొడుకు తన కళ్లముందే చనిపోతే ఆ కన్నతల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ కొడుకు మరణం గుండెల్ని పిండేస్తుంటే ఆ బాధను పంటి బిగువున అదిమి పెట్టి తన కొడుకుకి ఇష్టమైన పాటతో కడసారి వీడ్కోలు పలికింది ఓ తల్లి.

చ‌త్తీస్‌ఘ‌డ్‌కు చెందిన సూర‌జ్ తివారి జానప‌ద గాయ‌కుడు. అత‌ని త‌ల్లి పూన‌ర్ విరాట్ కూడా గాయకురాలే. కానీ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటు శనివారం (నవంబర్ 2) సూరజ్ (30) మరణించాడు. హాస్ప‌ిట‌ల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ కూడా సూరజ్  ఓ స్టేజ్ షోలో ప‌ర్ఫార్మ్ చేశాడు. ఆ త‌రువాత సూరజ్  చనిపోయాడు.

సూర‌జ్‌కు చోలా మాటి కే రామ్‌.. ఏక‌ర్ కా భ‌రోసా..అనే పాట అంటే ప్రాణం. సూరజ్ కు ఎంతో ఇష్ట‌మైన పాట అది. ఈ పాట చ‌త్తీస్‌ఘ‌డ్‌లో చాలా ఫేమ‌స్‌. సూర‌జ్ అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో కొడుకు ఎంతో ఇష్టమైన చోలా మాటి కే రామ్‌.. ఏక‌ర్ కా భ‌రోసా..అనే పాటను పాడింది తల్లి. ఆ పాట‌తో ఆమెకొడుకుకు నివాళి అర్పించింది. గుండెల్లోంచి పొంగుకు వస్తున్న బాధను అణచుకుని తీవ్ర భావోద్వేగంతో పాట‌ను పాడింది. సూర‌జ్ స్నేహితులు అత‌డి పార్ధీవ‌దేహం ముందే ఆ పాట‌కు తమ వాయిద్యపరికరాలను జత కలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. సూరజ్ మంచి ఆర్టిస్ట్ కూడా.