Gaurav Bora: మిరాయ్ లో శ్రీరాముడిగా చేసింది ఇతనే.. ఇంతకీ ఎవరీ గౌరవ్ బోరా?
తెలుగు వాళ్లకి శ్రీరాముడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. (Gaurav Bora)ఆ పాత్రలో ఆయన తప్ప ఇంకెవరు సరిపోరు అనే స్థాయిలో శ్రీరాముడిగా కనిపించాడు ఎన్టీఆర్.

Gaurav Bora played the role of Sri Ram in the movie Mirai.
Gaurav Bora: తెలుగు వాళ్లకి శ్రీరాముడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆ పాత్రలో ఆయన తప్ప ఇంకెవరు సరిపోరు అనే స్థాయిలో శ్రీరాముడిగా కనిపించాడు ఎన్టీఆర్. అయితే, ఈ మధ్య కాలంలో హిందూ మైథాలజీకి సంబందించిన కథనాలతో సినిమాలు చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వచ్చిన రీసెంట్ మూవీ మిరాయ్. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా.
Chiru-Karthik: మిరాయ్ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్.. మెగాస్టార్ తో నెక్స్ట్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్!
ఇదిలా ఉంటే, మిరాయ్ సినిమాలో శ్రీరాముడి పాత్ర ప్రేక్షకులకు ఎంత ఉద్వేగాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్స్ అన్ని జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిపోతున్నాయి. అంతలా ఆ పాత్రకు, ఆ పాత్రను ప్రెజెంట్ చేసిన తీరుకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇక అప్పటినుండి శ్రీరాముడిగా కనిపించింది ఎవరో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ నటుడు మరెవరో కాదు.. గౌరవ్ బోరా. ఉత్తరాఖండ్ ఖతీమా కు చెందిన గౌరవ్ బోరా(Gaurav Bora) డెహ్రాడూన్ లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశాడు. కానీ, చిన్నప్పటి నుండి నటనపై ఉన్న ఆసక్తితో న్యూ ఢిల్లీలో ఐదేళ్ళ పాటు ‘కింగ్ డమ్ ఆఫ్ డ్రీమ్స్, రాస్ థియేటర్ గ్రూప్’లో నటించారు.
అలా షార్ట్ ఫిలిమ్స్, హిందీ సీరియల్స్ చేస్తూ వచ్చాడు గౌరవ్ బోరా. ప్రముఖ ప్రకటనలు బజాజ్ ఫ్రీడమ్, టీవీయస్ ఐ క్యూబ్, సపోలా ఆయిల్, టాటా క్యాపిటల్, ఆక్వా గార్డ్ లో నటించాడు గౌరవ్. అలా మిరాయ్ లో శ్రీరాముడి పాత్ర చేసే అవకాశాని దక్కించుకున్నాడు. దీంతో, గౌరవ్ కు ఇప్పుడు నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఈ సక్సెస్ తో ఈ నటుడికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.