Madhya Pradesh : ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు.. 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన చిన్నారి

తవ్వకపు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం చిన్నారి 50 ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. బోర్ వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతోందని సెహోర్ ఎస్సీ మయాంక్ అవస్థీ తెలిపారు.

child borewell : మధ్యప్రదేశ్ లో చిన్నారి 300 అడుగుల లోతు కలిగిన బోరుబావిలో పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం సీహోర్ జిల్లా ముగవాళి గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా అనే రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. 30 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

దీంతో చిన్నారిని రక్షించేందుకు రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ఆపరేషన్ శృష్టి పేరుతో ఆపరేషన్ ప్రారంభించారు. జేసీబీ, ఇతర యాంత్రాలతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తొవ్వడం మొదలు పెట్టారు. అయితే, గత 17 గంటలుగా ఆపరేషన్ బ్రేక్ పడింది. డ్రిల్లింగ్ చేయడంతో బాలిక మరో 20 ఫీట్ల లోతుకు జారిపడినట్లు అధికారులు గుర్తించారు.

Family Disallows Marriage : ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని ప్రేయసీ, ప్రియులు ఏం చేశారంటే…

ఈ నేపథ్యంలో తవ్వకపు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం చిన్నారి 50 ఫీట్ల లోతు వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. బోర్ వెల్ చుట్టూ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆపరేషన్ మరింత సంక్లిష్టంగా మారుతోందని సెహోర్ ఎస్సీ మయాంక్ అవస్థీ తెలిపారు. వైబ్రేషన్ కారణంగా చిన్నారి మరింత కిందికి జారుతోందని, ప్రస్తుతం డ్రిల్లింగ్ నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరా తీశారు. తన సొంత జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో సహాయ చర్యలను వేగవంతం చేయాలని, చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు