Delhi School : మేళతాళాల మధ్య పిల్లాడిని స్కూల్‌కు పంపిన పేరెంట్స్

కాళ్లు..చేతులు పట్టుకుని బలవంతంగా బడికి తీసుకెళ్లిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా..ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Delhi School

Child On His First Day Of School : దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా…మూతపడిన స్కూల్స్ తెరుచుకుంటున్నాయి. పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు ఇంటికే పరిమితమయిన పిల్లలు..మళ్లీ స్కూల్ కు వెళ్లాలంటే..వెనుకంజ వేస్తున్నారు. తాము స్కూళ్లకు పోమని..మారం చేస్తున్నారు. వెళ్లనంటూ..ఓ చిన్నారి మారం చేస్తుండడంతో అతని కాళ్లు..చేతులు పట్టుకుని బలవంతంగా బడికి తీసుకెళ్లిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా..ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మేళతాళాల మధ్య పిల్లలను స్కూల్ కు పంపిస్తున్నారు ఓ తల్లిదండ్రులు.

Read More : Mancherial ACP : భార్య దొంగతనాలు చేస్తుంటే..భర్త బాడీగార్డ్ 

ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ @ikaveri షేర్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పిల్లలను బడికి పంపుతున్నారని వెల్లడించారు. స్కూల్ కు వెళ్లే మొదటి రోజు కాబట్టి..ఓ పేరెంట్స్ బ్యాండ్ బాజాతో వచ్చిందని రాశారు. ధౌలా కువాన్ లోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్ వద్ద ఈ సన్నివేశం కనిపించింది. పాఠశాల గేటు వద్ద ఓ కుటుంబం ఉండగా..బ్యాండ్ కొడుతున్నారు. పిల్లవాడిని చేతులు పైకి ఊపుతూ..ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించింది. చుట్టూ ఉన్న వారు కెమెరాలో బంధిస్తున్నారు. సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు.