Umbrellas in School: గొడుగులు పట్టి పాఠాలు చదువుకుంటున్న విద్యార్థులు
మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిల్లలు గొడుగులు పట్టుకుని చదువుకుంటున్న ఘటన రికార్డ్ అయింది. వీడియోను షేర్ చేస్తూనే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది కాంగ్రెస్.

Schhol Stuents
Umbrellas in School: మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిల్లలు గొడుగులు పట్టుకుని చదువుకుంటున్న ఘటన రికార్డ్ అయింది. వీడియోను షేర్ చేస్తూనే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది కాంగ్రెస్.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ కమల్ నాథ్, మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర సాలుజా వీడియో పోస్టు చేస్తూ.. క్లాసు రూంలలో టీచర్లు పాఠాలు చెప్తుండగా విద్యార్థులు గొడుగుల కింద కూర్చొని ఉన్నారు. స్కూల్ బిల్డింగుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని పేర్కొన్నారు.
“ఒక చేత్తో గొడుగులు పట్టుకుని మరొక చేత్తో అభ్యాసం చేయాల్సి వస్తుంది. లేదంటే రూఫ్ మీద నుంచి నీరు కారి స్కూల్ అంతా తడిచిపోవడమే. ఈ ప్రైమరీ స్కూల్ సియోని జిల్లాలోని కైరీకాలా గ్రామంలో ఉంది. శివరాజ్ ప్రభుత్వం రియాలిటీ ఇదే” అని వివరించారు.
Read Also: ఢిల్లీలో కాలుష్యం తగ్గట్లేదు..మరోసారి స్కూల్స్ మూసివేత..
“స్కూల్ బిల్డింగ్స్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. వర్షం వస్తే తడవకుండా గొడుగులు పట్టుకుని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల వర్షాలతో స్కూల్ కు వెళ్లాలంటే తాడు పట్టుకుని నది దాటాల్సిన దుస్థితి ఏర్పడింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.