Chinas Airline Suspends Cargo Flights Bringing Medical Supplies To India
Sichuan Airlines భారత్‌కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చైనా నుంచి భారత్‌కు నడిచే ఢిల్లీ సహా ఆరు రూట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంటూ సేల్స్ ఏజెంట్లకు సిచువాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ సోమవారం లేఖ రాసింది.
సిచువాన్ ఎయిర్‌లైన్స్ తాజా నిర్ణయంతో చైనా నుంచి భారత్‌కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర ఔషధాలు చేరవేయడంలో ప్రైవేటు వాణిజ్యదారులు చేస్తున్న కృషికి తీవ్ర అంతరాయం కలగనుంది. అయిత, అంతకుమందు కరోనాపై పోరాటంలో భారత్‌కు తాము సహాయ, సహకారాలను అందిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
సిచువాన్ ఎయిర్‌లైన్స్ నిర్ణయంతో చైనా నుంచి భారత్‌కు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం.. సవాలుగా మారనుంది. సింగపూర్ లేదా ఇతర దేశాల మీదుగా వేరే ఎయిర్‌లైన్స్ ద్వారా భారత్‌కు రవాణా చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ మనదేశానికి చేరుకునేందుకు చాలా ఆలస్యమవునుంది. అంతే కాకుండా, చైనాలోని ఆక్సిజన్ తయారీదారులు..ధరలను 35 నుంచి 40 శాతానికి పెంచారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సరుకు రవాణా ఛార్జీలనూ చైనా ప్రభుత్వం 20 శాతానికి పెంచిందని సమాచారం.