భారత్‌పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్‌పైకి ఉసిగొల్పుతోంది. ఈశాన్య భారతదేశంలోని ఉగ్రవాద సంస్థలకు చైనా సాయం చేస్తున్నట్టు ఇంటిలిజెంట్ వర్గాలు సమాచారం బట్టి తెలుస్తోంది.
ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాదులకు ఆధునిక ఆయుధాలు, ఆర్ధికంగా నిలబడేందుకు చైనా ధనసహాయం చేస్తున్నట్టుగా నివేదికలు ద్వారా తెలుస్తోంది. బుధవారం సాయంత్రం అస్సాం రైఫిల్స్ దళంపై జరిగిన దాడే ఇందుకు ఓ నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికపై ఆర్మీ నిఘాను పెంచింది.
బుధవారం సాయంత్రం మణిపుర్‌లో… మయన్మార్ సరిహద్దుల్లో చండేల్ జిల్లా సాదిక్తంపాక్ గ్రామంలో పెట్రోలింగ్ విధులు ముగించుకొని తిరిగి స్థావరానికి వెళ్తున్న అస్సాం రైఫిల్స్ సైనికులపై గుర్తు తెలియని ఉగ్రవాదులు బాంబు దాడులు చేశారు. ఈదాడిలో ముగ్గురు జవానులు మరణించగా, ఆరుగురికి గాయాలయ్యాయి.
మణిపూర్ లో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులం అని నాగా పీపుల్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ, ఉల్పా ఇండిపెండెంట్ సంయుక్తంగా ప్రకటించాయి. అయితే, ఈ మూడు ఉగ్రవాద సంస్ధలకూ చైనాతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈశాన్య భారతంలోని తీవ్రవాద సంస్థలన్నీ కలిపి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్రన్ సౌత్ ఈస్ట్ ఏషియాగా ఏర్పాటయ్యాయి. ఈ మిలిటెంట్ గ్రూప్‌లకు సాయం చేస్తూ భారత్‌పై కుట్రలు చేస్తోంది చైనా.