Christians Should Bred More Children Says Church
christians should bred more children says church : భారత ఈశాన్య రాష్ట్రం అయిన మిజోరాంలోని అతి పెద్ద చర్చి ప్రెస్బిటేరియన్. ఈ చర్చి కమిటీ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘క్రైస్తవుల సంఖ్య పెరగాలి..మహిళలు పిల్లల్ని ఎక్కుమందిని కనాలి’ అని వివాహిత జంటలకు తెలిపింది. గత శనివారం (డిసెంబర్ 12,2021) వివాహిత మిజో క్రిస్టియన్లకు ఎక్కువ పిల్లలను కనమని చర్చి కమిటీ సభ్యులు తెలిపారు. పిల్లల్ని కటానికి మిజోరం ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మెటర్నిటి లీవ్‌లు మరింత పొడిగింపు ఇవ్వాలని.. దీనికోసం చర్చి కమిటీ ప్రభుత్వానికి అప్పీల్ చేయాలని నిర్ణయించింది.
Read more : Vasa : పిల్లలకు వస పోస్తే తెలివితేటలు పెరుగుతాయా?..
కాగా మిజోరామ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. మిజోరాం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు. ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనదిగా ఉంది.
ఈక్రమంలో తగ్గిపోతున్న మిజో క్రిస్టియన్ల జనాభాను పెంచేందుకు స్థానిక ప్రజలు ఎక్కువ పిల్లలను కనాల్సిన అవసరం ఉందని..ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకమైనదని చర్చి కమిటీ సభ్యులు తెలిపారు. గర్బస్రావాలు, కుటుంబ నియంత్రణలు చేసేందుకు క్రైస్తవ మతంలో అనుమతి లేదని.. ఇలా చేయటం వల్లే మిజో క్రైస్తవుల జనాభా తగ్గిపోయిందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
Read more : Netflix India: భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా రేట్లు
కాగా..ప్రెస్బిటేరియన్ చర్చితోపాటు మిజోరంలోని మరో ప్రముఖ చర్చి అయిన బాప్టిస్ట్ చర్చి.. అలాగే ఇతర చర్చి కమిటీలు కూడా మిజోరం క్రైస్తవ ప్రజలను తమ అస్తిత్వం కోల్పోకుండా ఉండాలంటే.. ఎక్కువ పిల్లలను కనమని పదే పదే చెబుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే స్థానికులపై పిల్లల్ని కనాలని ఈ చర్చిలు ఒత్తిడి చేస్తున్నాయి. చర్చిల అభిప్రాయంతో యంగ్ మిజో అసోసియషన్(YMA) కూడా ఏకీభవించింది. రాష్ట్రంలోని క్రైస్తవ ప్రజలు జనాభా పెంచేందుకు వివాహితులు పిల్లల్ని ఎక్కువమందిని కనాలని..పిల్లల్ని కనటానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని మిజో అసోసియేషన్ నేతలు అభిప్రాయపడుతున్నారు.