Netflix India: భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా రేట్లు

ఇండియావ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ధరలు తగ్గనున్నాయి. మొత్తం నాలుగు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రేట్లను తగ్గించే పనిలో పడింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర పెరుగుతుందంటూ.....

Netflix India: భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా రేట్లు

Netflix

Netflix India: ఇండియావ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ధరలు తగ్గనున్నాయి. మొత్తం నాలుగు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రేట్లను తగ్గించే పనిలో పడింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర పెరుగుతుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవడం మంచి బిజినెస్ ప్లాన్ లా కనిపిస్తుంది.

ఈ ఫ్లాగ్‌షిప్ బేసిక్ ప్లాన్ రూ.499 నుంచి రూ.199వరకూ ఉన్న ధరల్లో 60శాతం తగ్గిస్తున్నారు. జులై 2019లో మొదలుపెట్టిన మొబైల్ ఓన్లీ ప్యాక్ ను రూ.199 నుంచి రూ.149కి కుదించారు. దీనికే సగం మంది నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లు మొగ్గుచూపుతున్నారట.

నాలుగు డివైజ్ లలో వీక్షించేందుకు ఉండే ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి. రూ.799గా ఉండే ప్లాన్ రూ.649కు, రెండు డివైజ్ లలో మాత్రమే వీక్షించేందుకు వీలుగా ఉండే రూ.649 ప్లాన్ రూ.499కి తగ్గిపోయింది.

……………………………………. : మొటిమల సమస్యకు చక్కని చిట్కాలు

యాక్టర్స్, టీవీ షోలపై మాట్లాడిన నెట్‌ఫ్లిక్స్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఇలా అన్నారు. ‘కస్టమర్లకు ధరను తగ్గించి విలువైన కంటెంట్ అందించాలనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కంటెంట్ తో ఇండియన్ యూజర్ల కోసం ముందుకొస్తున్నాం’ అని వివరించారు.

Netflix

Netflix