covid
children : కోవిడ్ నుంచి కోలుకున్న పిల్లల్లో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై.. తాజా రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కరోనాను జయించిన పిల్లలకు ఆ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశముందని ఎన్‌హెచ్‌ఎస్ రీసెర్చ్ తెలిపింది. పిల్లల్లో దీర్ఘకాలం కోవిడ్ రిస్క్ ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే.. ప్రతి ఒక్కరూ ఇంట్లోని చిన్నారుల పట్ల మరింత కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా.. చిన్నారులకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. కానీ.. వైరస్ సోకితే చాలా ఇబ్బందులు తలెత్తుతాయట.
కోవిడ్ నుంచి కోలుకున్నాక.. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్‌తో బాధఫడే అవకాశాలున్నాయని ఎన్‌హెచ్ఎస్ సర్వే తేల్చింది. కొన్ని గణాంకాల ప్రకారం.. 2 నుంచి 14 ఏళ్లు ఉన్న చిన్నారుల్లో 12.4 శాతం, 13 నుంచి 16 మధ్య వయసున్న వారిలో 16 శాతం మంది పిల్లలు.. కరోనా నుంచి కోలుకున్న 5 వారాల తర్వాత వారిలో మళ్లీ కరోనా లక్షణాలు బయటపడ్డాయట. కోవిడ్ రోగుల్లో.. మూడింట ఒక వంతు మంది.. వైరస్ నుంచి కోలుకున్నాక కరోనా లక్షణాలైన నొప్పి, గందరగోళం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు రీసెర్చ్‌లో తేలింది.
ఇలా ఎందుకు జరుగుతోందని.. వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్న సమయంలోనే.. ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో.. కోవిడ్ కారణంగా తలెత్తే అనేక అనారోగ్య సమస్యలకు బలైపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ కారణంగా.. పదహారేళ్లలోపు పిల్లలు చాలా రకాలుగా అనారోగ్యం పాలవుతున్నారట.