×
Ad

Cigarette Prices: భారీగా పెరగనున్న సిగరెట్ ధరలు..! ఎంతో తెలిస్తే గుండె గుభేల్ మనడం ఖాయం..!

ప్రస్తుతం సిగరెట్ల పొడవు, రకాన్ని బట్టి ప్రతి 1,000 సిగరెట్ల ప్యాక్ పై రూ. 200 నుండి రూ. 735 వరకు సుంకం విధించబడుతోంది.

Cigarette Prices: సిగరెట్ తాగే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇకపై సిగరెట్ తాగాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో. లేదా సిగరెట్ తాగడం ఆపేయాలి. ఎందుకంటే సిగరెట్ ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది.

ఎక్సైజ్ డ్యూటీ పెంచి సిగరెట్లను కొనలేనంత భారం చేయడానికి కేంద్రం సిద్ధమవుతోందట. అదే జరిగితే సిగరెట్ రేట్లు భగ్గుమనడం ఖాయం. అంటే.. ప్రస్తుతం 18 రూపాయలుగా ఉన్న ఒక్క సిగరెట్ ధర త్వరలో 72 రూపాయలకు పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదట. దీంతో రేట్లు పెంచేందుకు సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్‌-2025లో కేంద్రం ప్రపోజల్స్ పెట్టింది.

పార్లమెంటు.. కేంద్ర ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025కు ఆమోదం తెలిపిన తర్వాత దేశంలో సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన ఈ బిల్లు.. సిగరెట్లు, సిగార్ల నుండి హుక్కా, నమలబడే పొగాకు వరకు అనేక రకాల పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను సవరిస్తుంది.

ప్రస్తుతం సిగరెట్ల పొడవు, రకాన్ని బట్టి ప్రతి 1,000 సిగరెట్ల ప్యాక్ పై రూ. 200 నుండి రూ. 735 వరకు సుంకం విధించబడుతోంది. తాజా సవరణ ప్రకారం ఆ సుంకం 2వేల 700-11వేల రూపాయలకు పెరగనుంది. నమిలే పొగాకు(చీవింగ్ టొబాకో)పై సుంకాలు 25% నుండి 100%కి అంటే నాలుగు రెట్లు పెరుగుతాయి. హుక్కా పొగాకుపై సుంకాలు 25% నుండి 40%కి పెరుగుతాయి. ధూమపాన (స్మోకింగ్) మిశమాలపై సుంకాలు 60% నుండి 300%కి అంటే 5 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే.. ప్రస్తుతం రూ. 18 ఉన్న సిగరెట్ ధర త్వరలోనే రూ. 72 వరకు చేరొచ్చని అధికారుల అంచనా.

ఈ పెంపు ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలకు దారితీసింది. “నేను ధూమపానం చేసేవాడిని కాబట్టి, నేను ఈ నిర్ణయం ఇష్టపడుతున్నాను. నేను కూడా దీన్ని మానేయొచ్చు” అని ఒక రెడ్డిట్ యూజర్ కామెంట్ చేశాడు. “ధూమపానం చేసే వారు నిరాశకు గురవుతున్నారు. ఈ మార్పు మనలో చాలా మందిని ప్రభావితం చేయదు” అని మరో యూజర్ అన్నాడు.

కొందరు దీన్ని ప్రభుత్వ అతిక్రమణగా భావించారు. “నేను ఈ ‘బిగ్ బ్రదర్’ విధానాన్ని ద్వేషిస్తున్నా” అని ఒక యూజర్ అన్నాడు. ఇంతలో, మరికొందరు “బీడీ పీనే కా టైమ్ ఆగయా హై”, “మై తో ఢిల్లీ కి హవా మే జీ లేతా హు.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ” అని స్పందించారు.

Also Read: ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్.. ఈ బీమా కవచ్ ప్లాన్‌తో.. 100ఏళ్ల వరకు ఫుల్ ప్రొటెక్షన్.. ఎవరు అర్హులంటే?