Petrol Coupon : ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..ఫ్రీగా పెట్రోల్ పొందండి

.ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే..పెట్రోల్ ఫ్రీగా అందిస్తామని గుజరాత్ రాష్ట్ర సర్కార్ ప్రకటించడం విశేషం. నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించిన వారిలో 50 మందిని ఎంపిక చేసి...

Petrol Coupon : ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..ఫ్రీగా పెట్రోల్ పొందండి

Free Petrol

Updated On : December 5, 2021 / 3:29 PM IST

Petrol Coupon : ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులు వాహదారులకు సూచిస్తుంటారు. కానీ..డోంట్ ఖేర్ అంటూ వాహనాలను రోడ్డు మీద రయ్ రయ్ తిప్పుతుంటారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీంతో కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం తాగి వాహనం నడొపద్దని, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఏ తప్పు చేయని..వారు బలైపోతున్నారని..ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Read More : IIT-Kharagpur : స్టూడెంట్లకు బంపర్ ఆఫర్..ఖరగ్ పూర్ ఐఐటీ..ఏడాదికి రూ. 2 కోట్ల ప్యాకేజీ

తాజాగా..ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే..పెట్రోల్ ఫ్రీగా అందిస్తామని గుజరాత్ రాష్ట్ర సర్కార్ ప్రకటించడం విశేషం. దీనివల్లనైనా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. గుజరాత్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారింది. అందులో భాగంగా..ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికి రూ. 100 పెట్రోల్ ఉచితంగా అందచేస్తామని వెల్లడించింది. నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించిన వారిలో 50 మందిని ఎంపిక చేసి…వారికి ఉచితంగా పెట్రోల్, డీజిల్ కూపన్స్ అందిస్తున్నట్లు వడోదరా పోలీస్ కమీషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం సంవత్సరం పొడుగుతా కొనసాగుతుందన్నారు. మరి..ఎంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారో చూడాలి.