అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం

దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా

  • Publish Date - January 11, 2020 / 03:44 AM IST

దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ). దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసిన చట్టం. రాజకీయ దుమారం రేపుతున్న చట్టం. ఓవైపు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుగుతుండగా.. కేంద్రం తన పని తాను చేసుకుని పోతోంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది. ‘పౌరసత్వ (సవరణ) చట్టం 2019 (47)లోని సెక్షన్‌ 1లోని సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం దాఖలైన అధికారాల మేరకు ఈ చట్టంలోని నిబంధనల అమలుకు 2020 జనవరి 10వ తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది’ అని తెలుపుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను ఇంకా ఖరారు చేయలేదు. 2019 ఏడాది డిసెంబర్‌ 11న సీఏఏకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లో మతపరమైన అణిచివేతను ఎదుర్కొని 2014 డిసెంబర్‌ 31 నాటికి భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని ఈ చట్టంలో ఉంది. కాగా, సీఏఏ పేరుతో దేశంలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పిస్తున్నారని, రాజ్యాంగంలోని మౌలిక సిద్ధాంతాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ముస్లింలతోపాటు విపక్ష పార్టీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశాన్ని మత పరంగా విభజించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా నెల రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కాగా, మూడు పొరుగు దేశాల నుండి 2014 కి ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తానని హామీ ఇచ్చే ఈ చట్టం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాజ్యాంగంలోని ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించి.. మతం ఆధారంగా భారతదేశం మొదటిసారి పౌరసత్వం ఇస్తుందని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు అంటున్నారు.

సీఏఏ ఆమోద యోగ్యం కాదని, రద్దు చేయాలని పలువురు మేధావులు సైతం డిమాండ్ చేశారు. అయితే.. దేశ ప్రయోజనాల కోసమే ఈ చట్టం తెచ్చామని బీజేపీ చెబుతోంది. ఈ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. రాజకీయ లబ్ది కోసమే కొన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.

Also Read : నిర్భయ దోషులకు ఉరి…ప్రత్యక్షప్రసారం

ట్రెండింగ్ వార్తలు