Lata Mangeshkar: గాయకులు ఎందరొచ్చినా ఆమె లోటును తీర్చలేరు – సీఎం కేసీఆర్

భారతరత్న, గాన కోకిల లతా మంగేష్కర్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు పాటలతో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేసిన ఆమె మరణం తీరని లోటని

Lata Mangeshkar: భారతరత్న, గాన కోకిల లతా మంగేష్కర్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు పాటలతో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేసిన ఆమె మరణం తీరని లోటని అన్నారు.

భారత దేశానికి లతా మంగేశ్వర్ ద్వారా గాంధర్వ గానం అందింది. భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం. లతా జీ మరణం తో పాట మూగ బోయినట్లైంది. సంగీత మహల్’ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.

’20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు దాదాపు 1000 సినిమాల్లో పాడిన ఘనత లతా జీ సొంతం. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేసి తన గాత్రంలో గజల్ గమకాలను ఒలింకించేవారు లతా.

Read Also: గాన కోకిలకు సంతాపం వ్యక్తం చేస్తూ చిరు ట్వీట్

లతా జీ సమయం చూసుకుని సినిమా నిర్మాణం ప్రారంభించేవారట. దేశ విదేశాల వ్యాప్తంగా పురస్కారాలకు లతా జీ వల్లనే గౌరవం దక్కింది. గాయకులు ఎందరొచ్చినా లతా జీ లేని లోటు పూరించలేనిది.” అని సీఎం స్మరించుకుంటూ… ఆమె కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు