Bihar : బీహార్ రాష్ట్రంలో మళ్లీ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

బీహార్‌ రాష్ట్రంలో మళ్లీ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ సమీపంలో గూడ్స్ రైలు కోచ్ పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది....

goods train derails

Bihar : బీహార్‌ రాష్ట్రంలో మళ్లీ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ సమీపంలో గూడ్స్ రైలు కోచ్ పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ ఘటనపై ఇప్పటి వరకు రైల్వే అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కోచ్‌ను తరలించి, ప్రభావితమైన రైల్వే లైన్‌ను సరిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read : Maharashtra : మహారాష్ట్రలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్.. భయంతో జనం పరుగులు

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో గత వారం కూడా రైలు పట్టాలు తప్పింది. కామాఖ్య వెళుతున్న నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ బక్సర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో నలుగురు మరణించగా, మరో 42 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాల్లో వరుసగా రైళ్లు పట్టాలు తప్పుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు