తోక తొక్కాడని 2 కిమీ పరిగెత్తించిన తాచు

రోడ్ మీద వెళ్తుండగా అనుకోకుండా తాచు పాము తోకను తొక్కాడు ఓ బైకర్. అంతే 2కిలోమీటర్ల వరకూ అతణ్ని వెంబడించి ముచ్చెమటలు పట్టించింది త్రాచు. ఉత్తరప్రదేశ్‌లోని జలాన్ జిల్లాలో గుడ్డు పచౌరీ అనే వ్యక్తి మోటార్ బైక్ తో వెళ్తూ అనుకోకుండా త్రాచు తోకను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. 

పట్టించుకోకుండా వెళ్లిపోతున్న అతణ్ని వెంబడిస్తూ వచ్చింది. భయంతో స్పీడ్ పెంచి వెళ్తున్నప్పటికీ 2కిలోమీటర్ల వరకూ వెంబడించింది. ఎట్టకేలకు రోడ్ మీద నుంచి ఎగిరి బైక్ అందుకున్న పాము.. కాళ్ల వరకూ రావడంతో బైక్ వదిలేసి పరుగులంకించుకున్నాడు. 

బైక్ వద్ద గుంపు చేరినప్పటికీ పాము తగ్గలేదు. దగ్గరకు వెళ్లబోతున్న వారిని బుసలు కొడుతూ బెదిరించింది. అరగంట వరకూ చూసి కదలకపోవడంతో రాళ్లతో కొట్టారు. శాంతించిన పాము బైక్ వదిలి నిదానంగా పట్టింది.