కోడిపుంజును అరెస్ట్ చేసిన పోలీసులు

  • Publish Date - February 4, 2019 / 04:12 AM IST

మధ్యప్రదేశ్‌ : పోలీసులు చేసిన ఓ విచిత్రమైన పని హాట్ టాపిక్ గా మారింది. ఓ చిన్నారిని ఆ ప్రాంతంలో ఉండే కోడిపుంజు పొడిచింది. దీంతో పోలీసులు ఆ కోడిపుంజును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ  ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విచిత్రమైన పరిస్థితి మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. 

 

మధ్యప్రదేశ్‌లోని పురికి చెందిన జాటవ్, లక్ష్మి దంపతులకు పిల్లులు లేరు. ఈ క్రమంలో ఓ కోడిపుంజును తెచ్చుకుని స్వంత కుమారుడిలా చూసుకుంటున్నారు. చక్కటి ఆహార పెట్టిన అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ కోడిపుంజు రెండు రోజుల క్రితం పక్కంటిలో ఆడుకుంటున్న రాధిక అనే చిన్నారి బుగ్గపై పొడిచింది. దీంతో చిన్నారి బుగ్గకు పెద్ద గాయమైన రక్త స్రావం కూడా జరిగిందట. పాప ఏడుస్తూ వెళ్లి విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పింది. దీంతో లక్ష్మికి జరిగింది చెప్పగా దురుసుగా సమాధానం చెప్పటంతో వారు తిన్నగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాటవ్ ఇంటికెళ్లి కోడిపుంజును  స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన జాటవ్..భార్య లక్ష్మి లబోదిబోమంటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి కోడిపుంజును వదిలేయమని ప్రాధేయపడ్డారు. వదలవద్దని చిన్నారి తల్లిదండ్రులు..వదిలేమని లక్ష్మ వేడుకోవటంతో పోలీసులకు ఏం చేయాలో పాలు పోలేదు.

 

కోడిపుంజు పొరపాటున చిన్నారిని గాయపరిచిందని..దీన్ని వారు పెద్ద విషయం చేసి గొడవ చేస్తున్నారనీ..కోడిపుంజును కేవలం ఓ కోడిలా మాత్రమే చూడవద్దనీ..తమ కుమారుడిలా దాన్ని చూసుకుంటున్నామనీ మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామనీ..దయచేసి వదిలేయమని ప్రాధేయపడుతు కన్నీరు పెట్టుకుంది లక్ష్మి.  దీంతో కనికరించిన పోలీసులు చిన్నారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి..జాటవ్ దంపతులకు మధ్య రాజీ చేసి కోడి పుంజును లక్ష్మి దంపతులకు ఇచ్చేయటంతో వారు సంతోషంగా ఇంటికెళ్లిపోయారు.