Uttar Pradesh : డ్రగ్స్ ఇచ్చి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి యువతిని లాక్కెళ్లారు. యువతికి డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారం చేశారు.

college girl assault
College Girl Assault In Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో దారుణం జరిగింది. డ్రగ్స్ ఇచ్చి కాలేజీ విద్యార్థినిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1న ఒక విద్యార్థిని కాలేజీ అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు యువతిని అడ్డగించారు.
సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి యువతిని లాక్కెళ్లారు. యువతికి డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. దీనిని మొబైల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, వైరల్ అయిన ఈ వీడియో క్లిప్, మూడు రోజుల తర్వాత బాధిత యువతి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Karachi School Principal : కరాచీ కీచకుడు, 45 మంది మహిళా టీచర్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం
కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు తనను లాక్కెళ్లి డ్రగ్స్ ఇచ్చారని, మత్తులో ఉన్న తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే అత్యాచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని బాధితురాలు పోలీసులకు వివరించారు.
నిందితుల్లో ఒక వ్యక్తి గ్రామ పెద్దకు చెందిన బంధువని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.