Karachi School Principal : కరాచీ కీచకుడు, 45 మంది మహిళా టీచర్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45మంది మహిళా టీచర్లపై అత్యాచారాలకు పాల్పడ్డాడు ప్రిన్సిపాల్. వారిని బెదిరించి..భయపెట్టి లొంగదీసుకుని అత్యాచారాలకు తెగబడ్డాడు.

Karachi School Principal Women
Karachi School Principal : అతను స్కూల్ ప్రిన్సిపాల్. గౌరవమైన స్థానంలో ఉండీ నీచాతి నీచానికి ఒడిగట్టాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45మంది మహిళా టీచర్లపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. వారిని బెదిరించి..భయపెట్టి లొంగదీసుకుని అత్యాచారాలకు తెగబడ్డాడు. కానీ అంతకాలం అతని ఆగడాలు..అఘాయిత్యాలు కొనసాగినా చివరకు బయటపడ్డాయి. 45మంది మహిళా టీచర్లపై అత్యాచారాలకు పాల్పడినట్లుగా నిరూపించబడింది. పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్ లోని కరాచీ లో ప్రిన్సిపాల్ చేసిన ఈ దారుణం బయటపడింది. బ్లాక్ మెయిల్ చేసి 45 మంది మహిళా టీచర్లపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనల గురించి దర్యాప్తు చేయగా నిజమేనని తేలింది. సదరు కీచక ప్రిన్సిపల్ కేసు గురించి కరాచీ పోలీసులు తెలియచేస్తున్న సమాచారం ప్రకారం.. గపూర్ మెయిన్ అనే ప్రిన్సిపాల్ మహిళా టీచర్ లకు ఉద్యోగాలు ఆశలు కల్పించి లొంగదీసుకున్నాడు. అలా 45మందిని బెదిరించి లొంగదీసుకున్నాడు.
Auto Journey : ఆటోల్లో ప్రయాణిస్తున్నారా.. బీకేర్ ఫుల్.. ఎందుకంటే
నెలకు రూ.1,00,000లు ఇచ్చి ఓ స్కూల్ ను అద్దెకు తీసుకున్నాడు. అలా కొన్ని స్కూళ్లను అద్దెకు తీసుకున్నాడు. అలాంటి ఓ స్కూల్లో 10మంది మహిళలు, ఐదుగురు మగవారు టీచర్లు, 250మంది విద్యార్దులున్నారు. అలా అతను అద్దెకు తీసుకున్న స్కూళ్లలో మహిళా టీచర్లకు మంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ పెట్టి లొంగదీసుకున్నాడు. వారి సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి బెదిరించి వారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అలాంటి ఓ వీడియోలో సోషల్ మీడియాలో దుమారం రేగింది.
ఈక్రమంలో ఓవ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టగా మొత్తం 45మందిపై ఈ దారుణాలకు పాల్పడినట్లుగా తెలిసింది. ప్రిన్సిపాల్ ను గత సోమవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి కొన్ని అశ్లీల వీడియోలు, ఫోన్, లాప్ టాప్, ఆ టీచర్లతో ఏకాంతంగా గడిపిన వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. కరాచీ కోర్ట్ ఏడు రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసును విచారించడానికి ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.