Site icon 10TV Telugu

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధర.. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Commercial Cylinder

Commercial Cylinder

LPG Cylindr Price: గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ప్రతీనెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. తాజాగా.. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య సిలిండర్ ధర రూ.33.50 తగ్గింది. తగ్గిన ధరలు ఇవాళ్టి (శుక్రవారం) నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.

ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలతో రోజువారీ కార్యకలాపాలకు కమర్షియల్ సిలిండర్లను ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్యసంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. చిన్న వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్‌ ధర తగ్గింపు కొంతమేర ఉపశమనం కలిగించనుంది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

తాజాగా.. తగ్గించిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరల వివరాలను పరిశీలిస్తే.. ఢిల్లీలో నిన్నటి వరకు రూ.1,665 ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1,631.50కు తగ్గింది. కోల్‌కతాలో రూ.1735.50, ముంబైలో రూ.1616.50, చెన్నై రూ.1790‌కు తగ్గింది.

హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.57 తగ్గింది. దీంతో ప్రస్తుతం 19కేజీల సిలిండర్ ధర రూ.1,886.50 వద్దకు చేరింది. విజయవాడలో రూ.34.50 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం ధర రూ.1,788.50గా ఉంది. విశాఖపట్టణంలో రూ.34.50 తగ్గగా.. ప్రస్తుతం అక్కడ 19కేజీల సిలిండర్ ధర రూ.1,683.50గా నమోదైంది. అయితే, ఈ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Exit mobile version