Cattle Smuggling : ఆవులను దొంగిలించేందుకు సరిహద్దు దాటుతున్న బంగ్లా స్మగ్లర్లు

అర్ధరాత్రి సమయంలో సరిహద్దు దాటి త్రిపుర రాష్ట్రంలోని  గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లలోని ఆవులను దోగిలించి సరిహద్దు దాటిస్తున్నారు.

Cattle Smuggling :  భారత్ – బంగ్లా సరిహద్దుల్లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో సరిహద్దు దాటి త్రిపుర రాష్ట్రంలోని  గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లలోని ఆవులను దోగిలించి సరిహద్దు దాటిస్తున్నారు. ఈ మధ్య స్మగ్లర్లు దూకుడు పెంచారు. ఆవులు దొంగిలిస్తున్న సమయంలో పట్టుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. ఇలా స్మగ్లర్ల దాడిలో తీవ్ర గాయాలపైన వారు చాలామందే ఉన్నారు.

చదవండి : Gold Smuggling : హౌరా ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం పట్టివేత..

అయితే ఇదే క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి సెపాహిజాలా జిల్లా సోనామురా సబ్ డివిజన్ పరిధిలోని కమల్ నగర్‌లోకి ఆవుల దొంగతనానికి వచ్చిన ముగ్గురు బంగ్లా స్మగ్లర్లు లిటన్ పాల్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వారు స్మగ్లర్లను గమనించి కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కలవారు ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నారు.

చదవండి : Gold Smuggling : విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం స్వాధీనం

ఇదే సమయంలో ఇద్దరు స్మగ్లర్లు స్థానికులపై దాడి చేసి తప్పించుకొని పారిపోయారు. ఓ స్మగ్లర్ వారికి దొరకడంతో అతడిపై దాడి చేశారు.. దీంతో సదరు స్మగ్లర్ మృతి చెందాడు. ఇలా దొంగతనాలు తరచుగా జరుగుతుండటంపై స్థానికులు ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. పాడి ఆవులను దొంగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు