Gold Smuggling : విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం స్వాధీనం

విశాఖ రైల్వేస్ స్టేషన్ కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

Gold Smuggling : విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం స్వాధీనం

Gold Smuggling

Gold Smuggling :  విశాఖ రైల్వేస్ స్టేషన్ కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బంగారం అక్రమ రవాణా జరుగుతుందని పక్కా సమాచారం రావడంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడి బ్యాగ్ తనిఖీ చేశారు అధికారులు.

చదవండి : Visakhapatnam : సింహాద్రి ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

బ్యాగ్‌లో 1.91 కోట్ల విలువైన 3.98 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ బంగారం బంగ్లాదేశ్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి ముడిబంగారం తీసుకొచ్చి దానిని కోల్‌కత్తాలో ఆభరణాలుగా మార్చి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఒక్కడే ఈ విధంగా చేస్తున్నాడా? లేదంటే ఇతడికి టీమ్ ఏమైనా ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినారు.

చదవండి : Gold Prices Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..