Gold Smuggling : హౌరా ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం పట్టివేత..

యశ్వంత్‌పూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం పట్టుబడింది. గోల్డ్ తరలిస్తుండగా డీఆర్‌ఐ (DRI) అధికారులు పట్టుకున్నారు. సుమారు 2 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gold Smuggling : హౌరా ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం పట్టివేత..

Huge Gold Seized By Dri In Howrah Express

Gold Smuggling in Train: యశ్వంత్‌పూర్ – హౌరా ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం పట్టుబడింది. విశాఖ నుంచి అక్రమ బంగారాన్ని తరలిస్తుండగా డీఆర్‌ఐ (DRI) అధికారులు పట్టుకున్నారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బంగ్లాదేశ్ – కోల్‌కతా మీదుగా అక్రమ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోల్‌కతా నుంచి విశాఖపట్నం చేరుకున్న హౌరా – యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ప్రయాణికుడు.. ఎలాంటి పత్రాలు లేకుండా 3కిలోల 98 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడు.

సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు.. రైల్లో తనిఖీలు చేసి బంగారం స్మగ్లర్‌ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి నుంచి కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చినట్టు గుర్తించారు పోలీసులు.

ఇలా బంగ్లా నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని కోల్‌కతాలో కరిగించి గాజులు, అచ్చుల రూపంలోకి మార్చి తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం.. బంగారాన్ని అక్రమంగా తరలించే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్మగ్లింగ్ వ్యవహారంపై నిందితుడిని విచారిస్తున్నారు.
Read Also :  West Bengal : పశ్చిమబెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత