West Bengal : పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత
వారం రోజుల క్రితం శ్వాస సంబంధమైన సమస్య రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

West Bengal
West Bengal : తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్ను మూశారు. వారం రోజుల క్రితం శ్వాస సంబంధమైన సమస్య రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
చదవండి : West Bengal : మెడికల్ షాపు ఓనర్‌తో భార్య రాసలీలలు, తట్టుకోలేని భర్త
కాగా ప్రస్తుత మంత్రివర్గంలో పంచాయత్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా ఉన్నారు. ఆయన మృతిపై సీఎం మమతా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణ వార్త తెలియగానే ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖర్జీ మరణం తమకు తీరని లోటని మమతా బెనర్జీ అన్నారు.
చదవండి : West Bengal : బెంగాల్ పాలిట్రిక్స్ : బాంబు దాడులు వారి పనే – దిలీప్
కాగా విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన సుబ్రతా ముఖర్జీ ఆ తర్వాత రాజకీయాలవైపు మళ్లారు. 2000 నుంచి 2005 వరకు కోల్‌కతా మేయర్‌గా పనిచేశారు. 1971లో ఆయన బల్లిగంజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 75వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.