West Bengal : బెంగాల్ పాలిట్రిక్స్ : బాంబు దాడులు వారి పనే – దిలీప్

బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మూడు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఎంపీ ఇంటి గేటు మాత్రం ధ్వంసమైంది.

West Bengal : బెంగాల్ పాలిట్రిక్స్ : బాంబు దాడులు వారి పనే – దిలీప్

Wb

Arjun Singh’s house : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ తెల్లవారుజామున కొల్‌కతా సమీపంలోని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మూడు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఎంపీ ఇంటి గేటు మాత్రం ధ్వంసమైంది.

Read More : Road Tunnel : రెండు టన్నెళ్ల నుంచి విమానం తీసుకెళ్లిన పైలట్ .. వైరల్ వీడియో

అయితే ఈ దాడిని అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే చేసినట్లు బీజేపీ చీఫ్ దిలీప్‌ ఘోష్ ఆరోపించారు. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాంబులు వేసినట్లు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. తెల్లవారుజామున 6 గంటల సమయంలో దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన సమయంలో అర్జున్ సింగ్‌ ఢిల్లీలో ఉన్నారు. ఘటన వివరాలు తెలుసుకున్న ఆయన… ఈ సాయంత్రం వస్తున్నట్లు తన అభిమానులకు తెలిపారు.

Read More : Maha Ganesha : ‘ఆహా’ స్పెషల్.. పిల్లలకు ప్రసాదంతో పాటు వినాయకుడి కథ కూడా..

బెంగాల్‌లో నిరంతరం హింస జరుగుతోందని… దీనిని అరికట్టాలని గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపీ ఇంటిపై బాంబు దాడి జరగడం దారుణమని… దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన అర్జున్‌ సింగ్‌… 2019లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బరేక్‌పూర పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు అర్జున్ సింగ్.

Read More : Supreme Court: సాక్ష్యం లేకుండా డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పేషెంట్ చనిపోయాడని ఎలా అంటాం?

మరోవైపు… పశ్చిబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నిక కోసం శంఖారావం పూరించనున్నారు మమత బెనర్జీ. ఇవాళ్టి నుంచి దీదీ భవానీపూర్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. మొదట టీఎంసీ కార్యకర్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత భవానీపూర్‌లో పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి పాల‌య్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెల‌ల్లో ఎమ్మెల్యేగా ఆమె ఎన్నిక‌వ్వాల్సి ఉంది. ఆమె కోసం భ‌వానీపూర్ స్థానం నుంచి గెలుపొందిన తృణ‌మూల్ ఎమ్మెల్యే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరగనుంది.