Road Tunnel : రెండు టన్నెళ్ల నుంచి విమానం తీసుకెళ్లిన పైలట్ .. వైరల్ వీడియో

రెండు టన్నెళ్ల నుంచి విమానం నడిపి చరిత్ర సృష్టించారు పైలట్.. ఇటలీకి చెందిన స్టెంట్ పైలెట్ డారియో కోస్టా.. ఈ ఫీట్ ను విజయవంతంగా పూర్తి చేశారు.

Road Tunnel : రెండు టన్నెళ్ల నుంచి విమానం తీసుకెళ్లిన పైలట్ .. వైరల్ వీడియో

Road Tunnel

Road Tunnel : చాలామందికి సాహసాలు చేయడమంటే ఇష్టం.. ఎవరు చేయని పనులు చేసి పేరు ప్రఖ్యాతలు గడిస్తుంటారు. తాజాగా ఓ ఫైలెట్ గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇటలీకి చెందిన స్టంట్ ఫైలెట్ డారియో కోస్టా ట‌ర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న రెండు ట‌న్నెళ్ల నుంచి విమానాన్ని న‌డిపి చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఎందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం కొంచం పక్కకు జరిగినా ఫైలెట్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఎటువంటి భయం, బెరుకు లేకుండా ఫైలెట్ డారియో కోస్టా ఈ ఫీట్ పూర్తి చేశారు. వాహనాలు వెళ్లేందుకు నిర్మించిన టన్నెల్ నుంచి విమానం దూసుకెళ్లడం అద్భుతం..

41 ఏళ్ల డారియో.. టన్నెల్ ప్లయింగ్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇస్లాంబుల్ శివారుల్లోని నార్త‌ర్న్ మ‌ర్మ‌రా హైవేపై ఉన్న టీ1, టీ2 టన్నెళ్ల గుండా జివ్‌కో ఎడ్జ్ 540 రేస్ ప్లేన్‌ తీసుకెళ్లాడు. 1.4మైళ్ళ దూరాన్ని 43.33 సెకన్లలో పూర్తి చేశారు. టన్నెల్ లో విమానం గంటకు 152 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ ఫీట్ అనంతరం డారియో కన్నీరు పెట్టారు. మొదటి టన్నెల్ నుంచి రెండో టన్నెల్ లోకి ప్రవేశించే సమయంలో విమానాన్ని నియంత్రించడం కష్టంగా మారిందని ఫైలెట్ డారియో తెలిపారు.