మెట్రో రైళ్లల్లో సైకిళ్లను తీసుకెళ్లవచ్చు

  • Publish Date - November 19, 2020 / 02:31 AM IST

carry bicycles inside metro trains : మెట్రో రైళ్లు ప్రజల ఆదరణలు పొందుతున్నాయి. తొందరగా గమ్య స్థానానికి చేరుకోవడం, ట్రాఫిక్ సమస్యలను దూరం చేస్తున్నాయి. గంటల పాటు ట్రాఫిక్ చిక్కుకొనే సమస్యను తీర్చుతున్నాయి. దీంతో చాలా మంది మెట్రో రైళ్లలో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చి మెట్రో రైలు అధికారులు ఓ అడుగు ముందుకేశారు. ప్రయాణీకులు తమ వెంట సైకిళ్లను కూడా తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించారు.



ఆరోగ్యం, వ్యాయామం యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తెలుసని, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సాహించడానికి తాము మెట్రో రైలులో సైకిళ్లను తీసుకెళ్లడానికి అనుమతించాలని నిర్ణయించడం జరిగిందని కొచ్చి మెట్రో అదనపు చీఫ్ సెక్రటరీ ఆల్కేష్ కుమార్ శర్మ వెల్లడించారు. సైకిళ్ల వినియోగాన్ని పెంచుకొనేందుకు తమ నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని, నగరంలో సైకిళ్ల వినియోగం అధికమైనందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మొదట ప్రయోగాత్మకంగా…ఆరు స్టేషన్‌లలో మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు.



చంగంపుఝూ పార్క్, పాలరివత్తం, టౌన్ హాల్, ఎర్నాకుళం సౌత్, మహారాజ కాలేజీ, ఎర్నాకుళం మెట్రో రైల్వే స్టేషన్ లో ఉండే..సైకిళ్లను తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆదరణను చూసిన తర్వాత..ఇతర స్టేషన్ లలో ఈ అవకాశాన్ని విస్తరిస్తామని వెల్లడించింది. స్టేషన్ వద్దనున్న ఎలివేటర్లను ఉపయోగించుకోవచ్చని, రైళ్లలోకి ప్రవేశించడానికి అక్కడున్న సిబ్బంది సహకరిస్తారని తెలిపారు. ప్రయాణికులను తమ తమ సైకిళ్లను రైలు రెండు చివరి బోగీల్లో ఉంచవచ్చన్నారు.

ట్రెండింగ్ వార్తలు