పీఎంపై కాంగ్రెస్ బుక్ రిలీజ్ : మోడీ 100 తప్పులు.. మోడ్రాన్ శిశుపాలుడు

ప్రధాని నరేంద్ర మోడీ ఐదేళ్ల పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పీఎం మోడీపై 100 పేజీలతో కూడిన ఓ బుక్ ను రిలీజ్ చేసింది.

  • Publish Date - March 30, 2019 / 02:15 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ ఐదేళ్ల పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పీఎం మోడీపై 100 పేజీలతో కూడిన ఓ బుక్ ను రిలీజ్ చేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ ఐదేళ్ల పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పీఎం మోడీపై 100 పేజీలతో కూడిన ఓ బుక్ ను రిలీజ్ చేసింది. ఈ పుస్తకానికి ‘మోడీ 100 తప్పులు’ అని పేరు పెట్టి.. మోడ్రాన్ బీజేపీ శిష్యుపాల్ అంటూ ట్యాగ్ లైన్ జోడించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఈ పుస్తకాన్ని పబ్లీష్ చేసింది. దాదర్, కాంగ్రెస్ కార్యాలయంలోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలతో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, కె.సి. వేణుగోపాల్, అశోక్ చావన్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్.. మోడీ వంద తప్పులు అనే పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఈ పుస్తకంలో మోడీ తొలి తప్పిదంగా రాఫెల్ డీల్ అంశాన్ని ప్రచురించారు. ఈ చాప్టర్ లో రాఫెల్ డీల్ అవినీతితో అనీల్ అంబానీకి విజయం సాధించిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించింది. 36 ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్లపై రూ.58 కోట్ల డీల్ కుదుర్చుకుందంటూ ఆరోపించింది. ప్రధానిని లూటర్.. అంటూ సంబోధిస్తూ ఓ చాప్టర్ లో పొందుపరిచింది.

తన మల్టీ మిలినీయర్ మిత్రుడికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా పీఎం మోడీ దేశంలో వేలాది కోట్లరూపాయలను విస్తరించినట్టు చాప్టర్ లో ఉంది. మరో చాప్టర్ లో తప్పుడు హమీలు.. పని తక్కువ అనే శీర్షికతో ప్రచురించింది. మరో చాప్టర్ లో నోట్ల రద్దుపై ప్రస్తావిస్తూ.. డిమానిటైజేషన్ పేరుతో ఆర్థిక వ్యవస్థను దిగువ స్థాయికి చేరేలా చేశారని, మోడీ 100 తప్పుల్లో ఇదొకటిగా పేర్కొంది. దేశంలో నల్లడబ్బును రాత్రికిరాత్రే చిత్తుకాగితాల్లా మార్చేస్తానని ప్రకటించిన మోడీ.. దీనివల్ల బిజినెస్ కంపెనీలకు ఈ పేమెంట్ సర్వీసులతో ప్రయోజనం కలిగిందే తప్ప.. దేశ ప్రజలకు ఒరిగింది ఏమి లేదంటూ చాప్టర్ లో కాంగ్రెస్ ప్రస్తావించింది. 

బీజేపీ మోడ్రాన్ శిశుపాలుడు  
పీఎం మోడీని మోడ్రాన్ శిష్యుపాలుడిగా పేర్కొంది. మహాభారతంలో శిష్యుపాలుడి వంద తప్పుల వరకు క్షమించమని అతడి తల్లి కృష్ణ భగవానుడిని కోరిందని.. ఎప్పుడు అయితే 100 తప్పులు దాటి.. 101వ తప్పు చేశాడో అప్పుడే శిష్యుపాలుడిని తన సుదర్శన చక్రంతో అక్కడే కృష్ణుడు వధించాడని కాంగ్రెస్ పేర్కొంది. భారతంలో శిష్యుపాలుడి వలే.. మోడీ ఐదేళ్ల పాలనలో చేసిన 100 తప్పులను ప్రజలు గమనించారని ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నేత ఒకరు మోడీని ఉద్దేశించి విమర్శించారు.