షాకింగ్.. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ గుండెపోటుతో కాంగ్రెస్ నేత మృతి.. గవర్నర్‌ను విమర్శిస్తుండగా ఘటన..

వృద్ధులు, జబ్బులతో బాధ పడుతున్న వారే కాదు.. యువకులు, ఎలాంటి జబ్బులు లేని వ్యక్తులు, చివరికి పిల్లలు కూడా సడెన్ గా గుండెపోటుతో చనిపోతుండటం కలవరానికి గురి చేస్తోంది.

Heart Attack (Photo Credit : Google)

Heart Attack : గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత ఒకరు గుండెపోటుతో మరణించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెంగళూరు ప్రెస్ క్లబ్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. లైవ్ లో మాట్లాడుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతే, అలాగే కుప్పకూలారు. ఆ మరుక్షణమే చనిపోయారు. అంతా చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీకే రవిచంద్రన్ కర్నాటక వెనుకబడిన తరగతులు, మైనారిటీల సంఘం సభ్యుడు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కాసేపు మాట్లాడలేకపోయారు. ఇంతలోనే కుర్చీలో నుంచి ముందుకు పడిపోయారు.

చుట్టుపక్కల ఉన్న వారు ఇది చూసి షాక్ కి గురయ్యారు. వెంటనే ఆయనను పైకి లేవనెత్తారు. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. రవిచంద్రన్ గుండెపోటుతో మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు అనుమతిచ్చిన గవర్నర్ ను విమర్శిస్తుండగా.. ఈ ఊహించని ఘటన జరిగింది.

గుండెపోటు మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. వృద్ధులు, జబ్బులతో బాధ పడుతున్న వారే కాదు.. యువకులు, ఎలాంటి జబ్బులు లేని వ్యక్తులు, చివరికి పిల్లలు కూడా సడెన్ గా గుండెపోటుతో చనిపోతుండటం కలవరానికి గురి చేస్తోంది. మారిన జీవన శైలి కారణంగా ఈ తరహా మరణాలు పెరిగినట్లు డాక్టర్లు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలు గుండెపోట్లకు దారితీస్తున్నాయని వివరించారు.

 

ట్రెండింగ్ వార్తలు